Hit 2: 'హిట్ 2' రిలీజ్ డేట్ వచ్చేసింది.. సోషల్ మీడియాలో హీరో పోస్ట్..

Hit 2: హిట్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. సోషల్ మీడియాలో హీరో పోస్ట్..
Hit 2: హిట్ 2లో విశ్వక్ సేన్ బదులుగా అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.

Hit 2: తాము తెరకెక్కించిన సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉంటారు దర్శకులు. అలా కాకుండా ఒకే కథను రెండు పార్ట్‌లుగా చేసి సినిమాలు తెరకెక్కించడం కూడా ఈమధ్య ట్రెండ్ అయిపోయింది. అదే దారిలో యంగ్ హీరోలు కూడా నడుస్తున్నారు. నాని నిర్మాతగా తెరకెక్కిన 'హిట్' సినిమా రెండో భాగం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది టీమ్.

విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే 'హిట్'. ఈ సినిమా ఏ అంచనాలు లేకుండా విడుదలయ్యి సూపర్ హిట్‌ను అందుకుంది. ఇక హిట్ సినిమా కథ అర్థాంతరంగా ఆగిపోయినట్టుగా ఉంటుంది. పూర్తి కథ తెలుసుకోవాలంటే హిట్ 2 వచ్చేవరకు ఆగాల్సిందే అని దర్శకుడు పార్ట్ 1లోనే క్లారిటీ ఇచ్చాడు. అందుకే హిట్ 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

హిట్ 2లో విశ్వక్ సేన్ బదులుగా అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక అడవి శేష్ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అడవి శేష్. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన గ్లింప్స్ కూడా అందరినీ ఆకట్టుకోగా.. ప్రేక్షకులను మెప్పించడానికి హిట్ 2 జులై 29న విడుదల కానుంది. మరోవైపు అడవి శేష్ నటించిన మరో సినిమా 'మేజర్' మే 27 విడుదలను ఖరారు చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story