RRR: ఆర్ఆర్ఆర్ హవా మాములుగా లేదుగా.. సినిమా తీయడానికి రూ.500 కోట్లైతే ప్రమోషన్స్ కి రూ.40 కోట్లు

RRR: ఆర్ఆర్ఆర్ హవా మాములుగా లేదుగా.. సినిమా తీయడానికి రూ.500 కోట్లైతే ప్రమోషన్స్ కి రూ.40 కోట్లు
RRR: సినిమా కోసం 100 ఎకరాలకు పైగా భూమిని లీజుకు తీసుకున్నారు.

RRR: భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీగా ప్రమోషన్.. వెరసి రాజమౌళి చిత్రం కోసం భారీగా ఎదురుచూపులు. బాహుబలి: ది కన్‌క్లూజన్ తర్వాత జక్కన్న చేతిలో రూపుదిద్దుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం గురించిన ఆసక్తికర విషయాలు చాలానే ఉన్నాయి.

అల్లు అర్జున్ సినిమాలో డైలాగ్ గ్యాప్ తీసుకోలా వచ్చిందంతే అన్నట్టు.. ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టిన వేళా విశేషం కరోనా వచ్చి ఆ ప్రాజెక్ట్ ఇన్ని రోజులు సాగడానికి ఓ మేజర్ కారణమైంది.

అయినా రాజమౌళి ఏ మాత్రం నిరుత్సాహపడలేదు.. ప్రాజెక్ట్ ని అనుకున్న విధంగా రూపొందించారు. చిత్రంలోని ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ ని సంపాదించింది.

ఇక ప్రమోషన్ల విషయంలో కూడా ఎక్కడా రాజీ పడలేదు దర్శక నిర్మాతలు.. సినిమా కోసం రూ.500 కోట్లు ఖర్చుపెడితే.. ప్రమోషన్ల కోసం మాత్రమే దాదాపు రూ 40 కోట్లు ఖర్చుపెట్టిందంటే చిత్రం ఏ స్థాయిలో ఉండబోతోందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ చిత్రాన్ని హైదరాబాద్, పూణె, ఉక్రెయిన్ లో 300 రోజులు చిత్రీకరించారు. షూటింగ్ లో ఎక్కువ భాగం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. దీనికోసం ఓ ప్రత్యేక సెట్ ను నిర్మించారు.

సినిమా కోసం 100 ఎకరాలకు పైగా భూమిని లీజుకు తీసుకున్నారు. అందులోనే ఓ విలాసవంతమైన భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది రాజమౌళి కుటుంబం. ఇందులో సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

60 దేశాల్లో రికార్డు స్థాయిలో విడుదలవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం నాలుగేళ్లు అంకితం చేశారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఒక్కొక్కరు రూ.45 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు.

సినిమా లాభాల్లో రాజమౌళి ఫ్యామిలీకి అత్యధిక వాటా ఉంటుంది. సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చుచేశారు.

ఏపీ. తెలంగాణలోని అన్ని థియేటర్లలో ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. టిక్కెట్లకు భారీ డిమాండ్ ఉంది. హైదరాబాద్ లో ప్రీమియర్ షో తెల్లవారుజామున ఒంటి గంటకు ప్రారంభమవుతుందని సమాచారం.

ఆర్ఆర్ఆర్ కల్పిత కథే అయినా యాక్షన్ తో పాటు, బలమైన ఎమోషన్ డ్రామా కూడా ఉంటుంది. సో ఫ్యాన్స్ వెయిటింగ్ ఫర్ ఆర్ఆర్.

Tags

Read MoreRead Less
Next Story