Money Movie : 'మనీ' సినిమాకి అన్నీ కష్టాలే.. కట్ చేస్తే ఒకేఒక్క క్యారెక్టర్‌‌తో మూడు కోట్లు వసూళ్ళు.. !

Money Movie :  మనీ సినిమాకి అన్నీ కష్టాలే.. కట్ చేస్తే ఒకేఒక్క క్యారెక్టర్‌‌తో మూడు కోట్లు వసూళ్ళు.. !
Money Movie : రామ్ గోపాల్ వర్మ దగ్గర శివ, క్షణం క్షణం సినిమాలకి కో-డైరెక్టర్‌గా పనిచేశారు శివనాగేశ్వరరావు.. శివ సినిమా అయిపోయాక డైరెక్టర్‌‌గా ప్రయత్నాలు మొదలుపెట్టారాయన..

Money Movie : రామ్ గోపాల్ వర్మ దగ్గర శివ, క్షణం క్షణం సినిమాలకి కో-డైరెక్టర్‌గా పనిచేశారు శివనాగేశ్వరరావు.. శివ సినిమా అయిపోయాక డైరెక్టర్‌‌గా ప్రయత్నాలు మొదలుపెట్టారాయన.. ఆయన చెప్పిన సిసింద్రి కథకి నాగార్జున గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు.. కానీ నాగ్ బిజీ షెడ్యుల్ వల్ల సిసింద్రి మూవీ లేట్ అయింది. ఈ విషయం తెలుసుకున్న వర్మ.. తానే నిర్మాతగా మారి దర్శకుడిగా అవకాశం ఇస్తానని చెప్పారు. కథ కోసం కొన్ని ఐడియాలు వర్మ చెప్పగా వాటిలోంచి శివనాగేశ్వరరావు హాలీవుడ్ సినిమా "రూత్ లెస్ పీపుల్‌" కథాంశం నచ్చి దాన్ని ఎంచుకున్నాడు.

చిన్నచిన్న మార్పులతో 'మనీ' కథని సిద్దం చేశారు శివనాగేశ్వరరావు.. ఇద్దరు హీరోలుగా చిన్నా, జేడీ చక్రవర్తిని ఫైనల్ చేశారు వర్మ.. మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రాఫర్‌‌గా ఇప్పటి దర్శకుడు తేజని తీసుకున్నారు.. ముందుగా ముప్పై లక్షలతో సినిమాని చేయాలనీ అనుకున్నారు వర్మ..శివ సినిమాతో బాలీవుడ్‌‌లో కూడా వర్మకి పేరు రావడంతో దీనిని హిందీలో కూడా ఒకేసారి చేయాలని అనుకున్నారు.. కానీ అనుకున్న బడ్జెట్ సగం సినిమాకే ఆగిపోయింది.. దీనితో ఏడాది తర్వాత షూటింగ్ మొదలైంది. ఈ క్రమంలో సినిమాకి మళ్ళీ బ్రేక్ పడింది.. సినిమాలో కీ రోల్ అయిన పరేష్ రావల్‌‌కి యాక్సిడెంట్ కావడంతో మరో ఆరునెలలు షూటింగ్ వాయిదా పడింది.

ఆ తర్వాత ఎట్టకేలకు ఈ సినిమాని రూ. 55 లక్షలతో ఫినిష్ చేశారు. సినిమా పూర్తయ్యాక రిలీజ్ చేయడంలో మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమాని చూసిన పంపిణీదారులకు ఎవరికీ కూడా ఈ సినిమా నచ్చలేదు.. ఏకంగా 50 రోజుల పాటు సినిమాను ప్రివ్యూ వేసి చూపించారు. ఒకానొక టైంలో ఈ సినిమా రిలీజ్ కాదని దర్శకుడు శివనాగేశ్వరరావు బలంగా అనుకున్నారట.. కానీ అన్నపూర్ణ స్టూడియో సహకారాలతో 1993లో రిలీజైంది ఈ చిత్రం.. చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమాకి మౌత్ టాక్ ఎక్కువ కావడంతో ప్రేక్షకుల బ్రహ్మారధం పట్టారు. రూ. 55లక్షలతో తెరకెక్కిన ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్‌‌కి ఐదారు రెట్లు అంటే రూ.3 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికి తెలుగు సినిమాల్లో కనిపించని కొత్త తరహా హాస్యాన్ని అందించిన సినిమాగా ఈ చిత్రంగా నిలిచింది.

అయితే ఈ సినిమాకి ఇన్ని కోట్లు, ఇంత రెస్పాన్స్ రావడానికి వన్ అఫ్ ది మెయిన్ పిల్లర్ ఖాన్ దాదా పాత్ర.. అవును సినిమా షూటింగ్ అయిపోయాక సెన్సార్ బోర్డు రూల్స్ ప్రకారం సినిమా నిడివి లేదని చెప్పడంతో అప్పటికప్పుడు ఖాన్ దాదా పాత్రని క్రియేట్ చేశారు శివనాగేశ్వరరావు.. అది రాసుకున్నప్పుడే బ్రహ్మానందంతోనే చేయించాలని ఫిక్స్ అయ్యరాయన.. కేవలం మూడు రోజుల పాటు షూటింగ్‌‌లో పాల్గొన్నారు బ్రహ్మానందం.. సీరియస్‌గా ప్రవర్తిస్తూ హాస్యాన్ని పండించే ఖాన్ దాదా పాత్ర సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. "వారేవా ఏమి ఫేసు" పాటలో బ్రహ్మానందం ఇచ్చే హావభావాలు ఇంకో లెవల్ అంతే.. ఇప్పటికి ఈ సినిమాని రిపీట్‌‌గా చూసే ఆడియన్స్ ఉన్నారంటే అది కేవలం బ్రహ్మానందం కోసమే అని బలంగా చెప్పవచ్చు. అందరికి నచ్చిన ఖాన్ దాదా పాత్ర బ్రహ్మానందం కెరీర్‌‌లో తొలి నంది అవార్డును తెచ్చిపెట్టింది.

ఇక ఈ సినిమాలో "చక్రవర్తికి వీధి భిక్షగత్తెకీ", "లేచిందే లేడికి పరుగు" పాటలు రెండూ ఎం. ఎం. కీరవాణి స్వరపరిచారు.. ఆ తర్వాత వర్మకి, కీరవాణికి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో సంగీత దర్శకుడిగా శ్రీని తీసుకున్నారు.. ముందుగా సినిమాటోగ్రాఫర్‌‌గా తీసుకున్న తేజ్‌‌కి బాలీవుడ్ లో ఆఫర్ రావడంతో చోటా కే నాయిడు మిగతా సినిమాని టేకాఫ్ చేశారు. సమీర్ రెడ్డి, శ్యామ్ కే నాయిడు ఈ సినిమాకి అసిస్టెంట్ కెమరామెన్ లుగా పనిచేశారు.

ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా మనీ మనీ (1995), మనీ మనీ, మోర్ మనీ (2011) చిత్రాలు వచ్చాయి. మనీ మూవీని హిందీలో లవ్ కే లియే కుచ్ భీ కరేగా 2001లో రీమేక్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story