Mahesh Babu : మాస్ లుక్‌లో మహేష్.. . 'సర్కారు వారి పాట' నుంచి కీలక అప్డేట్..!

Mahesh Babu : మాస్ లుక్‌లో మహేష్.. . సర్కారు వారి పాట నుంచి కీలక అప్డేట్..!
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ మెయిన్ లీడ్‌‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట..

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ మెయిన్ లీడ్‌‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ మే 12న రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమా నుంచి కీలకమైన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయిందని, మే12న రిలీజ్ కానుందని, ఆ రోజు నుంచి బాక్స్ ఆఫీస్ రికవరీ ప్రారభం అవుతుందని వెల్లడించింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.

ఇందులో మహేష్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ సినిమా పైన భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు మహేష్.

Tags

Read MoreRead Less
Next Story