John Abraham: 'తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయను.. నేను ఓ బాలీవుడ్ హీరోని': జాన్ అబ్రహం

John Abraham (tv5news.in)

John Abraham (tv5news.in)

John Abraham: ఒకప్పుడు సౌత్ సినిమాలంటే బాలీవుడ్‌లో అంతగా పాపులారిటీ ఉండేది కాదు.

John Abraham: పాన్ ఇండియా సినిమాలు అనే ఓ కొత్త ట్రెండ్ సినిమాల్లో మొదలయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా దర్శకులు, నిర్మాతలు, నటీనటులు సినిమాలు చేస్తున్నారు. కానీ కొందరు బాలీవుడ్ నటీనటులు మాత్రం ఇంకా సౌత్ సినిమాలను తక్కువ చేసి చూస్తున్నట్టుగానే అనిపిస్తోంది. ఇటీవల జాన్ అబ్రహం చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దీనికి ఒక ఉదాహరణలాగా అనిపిస్తోంది.

ఒకప్పుడు సౌత్ సినిమాలంటే బాలీవుడ్‌లో అంతగా పాపులారిటీ ఉండేది కాదు. ఎందుకంటే బాలీవుడ్ వారికి ఉన్నంత మార్కెట్ సౌత్ సినిమాలకు ఉండేది కాదు. కానీ 'బాహుబలి' ఆ రొటీన్ ఫార్ములానే మార్చేసింది. తెలుగు సినమా స్థాయి ఏంటో తెలియజేసింది. అంతే కాకుండా సౌత్ సినిమాల స్థాయినే మార్చేసింది. అయినా ఇంకా కొందరు బాలీవుడ్ నటీనటులకు ప్రాంతీయ భాషా సినిమాలంటే చిన్నచూపు ఉంది.

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. కేజీఎఫ్‌తో శాండిల్‌వుడ్ ఖ్యాతిని చాటిచెప్పిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమే 'సలార్'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జాన్ అబ్రహం వీటిపై స్పందించాడు.

తాను ఏ ప్రాంతీయ సినిమాలో నటించనని, తానొక బాలీవుడ్ హీరో అని చెప్పుకొచ్చాడు జాన్ అబ్రహం. తాను ఎప్పుడూ ఏ సినిమాలో సెకండ్ హీరోగా కనిపించనని తేల్చిచెప్పాడు. మిగతా నటీనటులలాగా ఏదో ఇండస్ట్రీలో ఉండడం కోసం తాను తెలుగు సినిమాల్లో కానీ, ఇంకే ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించనని స్పష్టం చేశాడు జాన్ అబ్రహం.

Tags

Read MoreRead Less
Next Story