NTR : 'కీరవాణి కంపోజ్ చేసిన చెత్త సాంగ్ అదే' : ఎన్టీఆర్

NTR : కీరవాణి కంపోజ్ చేసిన చెత్త సాంగ్ అదే : ఎన్టీఆర్
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.. ఎట్టకేలకు మార్చి 25న గ్రాండ్ రిలీజ్‌‌కి సిద్ధమవుతోంది.

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.. ఎట్టకేలకు మార్చి 25న గ్రాండ్ రిలీజ్‌‌కి సిద్ధమవుతోంది. టాలీవుడ్ జక్కన్న డైరెక్షన్‌‌లో వస్తోన్న ఈ మూవీలో ఒలివియా మోరిస్, అలియా భట్ హీరోయిన్ లుగా నటించారు.

భారీ బడ్జెట్‌‌తో డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అయితే మూవీ ప్రమోషన్‌‌లో భాగంగా ఎన్టీఆర్, చరణ్ లతో కలిసి చిట్ చాట్ నిర్వహించారు కీరవాణి. అయితే తాను కంపోజ్ చేసిన ఒక చెత్త పాటను వెల్లడించమని తారక్, చరణ్ లను కోరారు కీరవాణి.

దీనిపైన స్పందించిన ఎన్టీఆర్.. ఘరానా బుల్లోడు సినిమాలోని భీమవరం బుల్లోడా పాట తనకు నచ్చదని తెలిపాడు. లిరిక్స్ విషయంలోనూ ఏమో కానీ తనకి ఆ పాట అంటే నచ్చదని వెల్లడించాడు. కానీ ఈ పాట సూపర్ సక్సెస్ అయింది. ఇక రామ్ చరణ్ కూడా ఓ పాటని చెప్పేందుకు ట్రై చేశాడు కానీ ఆ సినిమా గుర్తుకురావడం లేదని, అది చిన్న మూవీ అని 2021లో రిలీజై అయిందని తెలిపాడు.

ఇక బాహుబలి లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత జక్కన్న నుంచి సినిమా వస్తోండడం, చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా తారక్ కనిపించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story