Kangana Ranaut: దీపికా 'గెహ్రియాన్'కు కంగనా ఇన్‌డైరెక్ట్ కౌంటర్.. చెత్త సినిమా అంటూ..

Kangana Ranaut: దీపికా గెహ్రియాన్కు కంగనా ఇన్‌డైరెక్ట్ కౌంటర్.. చెత్త సినిమా అంటూ..
Kangana Ranaut: ఈ మాటలన్నీ దీపికా గెహ్రియాన్ సినిమాకే కనెక్ట్ అవుతున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.

Kangana Ranaut: బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా.. దీపికా పదుకొనె నటించిన 'గెహ్రియాన్' సినిమా గురించే. ట్రైలర్ విడుదలయిన దగ్గర నుండే ప్రేక్షకుల చూపు గెహ్రియాన్‌పై పడింది. అంతే కాకుండా రణవీర్‌తో పెళ్లి తర్వాత దీపికా ఇలాంటి ప్రేమకథలో నటించడం మొదటిసారి కావడంతో నెటిజన్లు తనను విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో సినిమాకు ఉచితంగా పబ్లిసిటీ కూడా లభించినట్టయ్యింది. తాజాగా ఈ సినిమాపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.

తనకు నచ్చింది అయినా, నచ్చనిది అయినా.. వెంటనే దానిపై తన స్టైల్‌లో స్పందించడం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్టైల్. అందుకే తాను ఏ కామెంట్ చేసిన అది సెన్సేషన్ అవుతుంది. ఇటీవల కంగనా హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమం లాంచ్‌లో జర్నలిస్ట్ దీపికా గురించి ప్రశ్నించగా.. తన గురించి తాను చూసుకోగలదు, తన సినిమాను నేను ప్రమోట్ చేయను అని తెలిపింది. ఇప్పుడు అదే సినిమా తన రివ్యూను బయటపెట్టింది కంగనా.

'నేను కూడా ఈ తరానికి చెందినదాన్నే కానీ నాకు ఈ రకమైన రొమాన్స్ అర్థమవుతుంది. ఈ తరం అన్న పేరుతో చెత్త సినిమాలను అమ్మవద్దు ప్లీజ్. చెత్త సినిమాలంటే చెత్త సినిమాలే. అందులో ఎన్ని రొమాంటిక్ సీన్లున్నా అలాంటి సినిమాను కాపాడలేవు. ఇది ఎంతో లోతుగా అర్ధం చేసుకోవాల్సిన విషయం కాదు.. ఒక సాధారణ నిజం' అని కంగనా తన సోషల్ మీడియాలో తెలిపింది.


కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. గెహ్రియాన్ పేరు కానీ.. దీపికా పేరు కానీ.. కంగనా ఇందులో ప్రస్తావించలేదు. అంతే కాకుండా తాను పెట్టిన ఈ క్యాప్షన్‌కు ఓ పాత హిందీ పాటను జతచేసింది కంగనా. అయితే ఈ మాటలన్నీ దీపికా గెహ్రియాన్ సినిమాకే కనెక్ట్ అవుతున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. అంతే కాకుండా గెహ్రియాన్ సినిమాపై ఇదే కంగనా రివ్యూ అని కూడా ఫిక్స్ అయిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story