Kangana Ranaut: 'అతడు నన్ను అభ్యంతరకరంగా తాకేవాడు:' కంగనా రనౌత్

Kangana Ranaut: అతడు నన్ను అభ్యంతరకరంగా తాకేవాడు: కంగనా రనౌత్
Kangana Ranaut: కంగనా.. తన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

Kangana Ranaut: బాలీవుడ్ కాంట్రవర్షియల్ క్వీన్ కంగనా రనౌత్.. మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న నటి. అందుకే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. ఎన్ని అవమానాలు ఎదురయినా తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోతుంటుంది. ఇప్పటికీ ఎన్నోసార్లు జీవితంలో తాను ఎదుర్కున్న ఒడిదొడుకులను బయటపెట్టిన కంగనా.. తాజాగా మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది.


ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే హోస్ట్ అవతారమెత్తింది కంగనా రనౌత్. హిందీలోనే కాంట్రవర్షియల్ షోగా మారిన 'లాక్ అప్'లో ప్రతీ వారం జడ్జిమెంట్ డే రోజు ఎంతోమంది బాలీవుడ్ నటీనటుల పర్సనల్ విషయాలు బయటపడుతున్నాయి. అలాగే తాజాగా ఓ నటుడు తాను చిన్నప్పుడు ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టాడు.

లాక్ అప్‌లో ఒక కంటెస్టెంట్ అయిన మునావర్ ఫరూఖీ తాను చిన్నప్పుడు జరిగిన లైంగిక వేధింపుల గురించి నోరువిప్పాడు. ఆరేళ్ల నుండి 11 ఏళ్లు వచ్చేవరకు తన దగ్గర బంధువులు ఇద్దరు తనను లైంగికంగా వేధించారని తెలిపాడు మునావర్. చిన్న పిల్లాడు కాబట్టి తనకు అప్పుడు ఏమీ అర్థం కాలేదని, ఒకవేళ పెద్దవాళ్లకు చెప్పినా.. వారు తనను అర్థం చేసుకోరేమో అని ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అన్నాడు.


ఈ విషయాన్ని విన్న కంగనా.. తన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను దాదాపు ఆరేళ్ల వయసున్నప్పుడు తనకంటే వయసులో పెద్ద అయిన ఓ వ్యక్తి తనను అసభ్యకరంగా తాకేవాడు అని తెలిపింది కంగనా. కానీ ఆ సమయంలో అతని ఉద్దేశం నాకు అర్థం కాలేదని చెప్పింది. తమను బట్టలు విప్పమని చెప్పి ఒళ్ళంతా తడిమేవాడని బయటపెట్టింది. ఇలాంటివి సమాజంలో ఓ పెద్ద క్రైమ్‌గా పరిగణించాలని తెలిపింది కంగనా.

Tags

Read MoreRead Less
Next Story