keerthy Suresh : కళావతి సాంగ్ షూటింగ్ టైంలో నా కాస్ట్యూమ్స్ కొట్టేశారు : కీర్తి సురేష్

keerthy Suresh : కళావతి సాంగ్ షూటింగ్ టైంలో నా కాస్ట్యూమ్స్ కొట్టేశారు : కీర్తి సురేష్
keerthy Suresh : దర్శకుడు పరశురాం, హీరోయిన్ కీర్తి సురేశ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

keerthy Suresh : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన యాక్షన్, రొమాంటిక్ అండ్ కామెడీ మూవీ సర్కారు వారి పాట... గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. దర్శకుడు పరశురాం, హీరోయిన్ కీర్తి సురేశ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బార్సిలోనాలో కళావతి సాంగ్ షూటింగ్ జరుగుతుండగా దొంగలు తన కాస్ట్యూమ్స్​ఎత్తుకెళ్ళారని చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్... ఆ నగరంలో దొంగల బెడద ఎక్కువని, షూట్ చేస్తోన్న టైంలో కొందరు దొంగలు వ్యానును బద్దలుకొట్టి.. కాస్ట్యూమ్స్ అన్నింటినీ ఎత్తుకెళ్లిపోయారని తెలిపింది.

అయితే మళ్ళీ 48 గంటల్లోపు కొత్త కాస్ట్యూమ్స్ ని ఇండియా నుంచి తెప్పించారని వెల్లడించింది. కాగా ఈ సినిమాని GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. సరిలేరు నీకెవ్వరు లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత సూపర్ స్టార్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story