KGF 2 Collections : బాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న KGF 2.. RRR రికార్డు బద్దలు..!

KGF 2 Collections : బాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న KGF 2.. RRR  రికార్డు బద్దలు..!
KGF 2 Collections : బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది కేజీఎఫ్ చాప్టర్ 2... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ

KGF 2 Collections : బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది కేజీఎఫ్ చాప్టర్ 2... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్కడ తొలిరోజు రూ. 53.30కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలవగా, రెండో రోజు రూ. 46.79కోట్లు, మూడో రోజు రూ. 42.90 కోట్లు రాబట్టింది.

మొత్తంగా మూడు రోజుల్లో రూ. 143.64కోట్ల సాధించింది. రాజమౌళి RRR మూవీకి తొలి మూడు రోజుల్లో వంద కోట్లు కూడా రాలేదు. కానీ కేజీఎఫ్ రెండు రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. ఈ లెక్కతో RRR రికార్డుని బద్దలు కొట్టింది. ఇదే లెక్కన కొనసాగితే RRR తో పాటుగా ఇతర సినిమాల రికార్డులని కేజీఎఫ్ చాప్టర్ 2 అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ మూవీలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్ , ప్రకాష్ రాజ్, రవీనా టాండన్ ప్రధాన పాత్రలు పోషించారు.

Tags

Read MoreRead Less
Next Story