KGF Chapter 2: కేజీఎఫ్ ఖాతాలో మరో రికార్డ్.. ఆ భాషలో విడుదల కానున్న తొలి సౌత్ సినిమాగా..

KGF Chapter 2: కేజీఎఫ్ ఖాతాలో మరో రికార్డ్.. ఆ భాషలో విడుదల కానున్న తొలి సౌత్ సినిమాగా..
KGF Chapter 2: కేజీఎఫ్ చాప్టర్ 2ను భారీ క్యాస్టింగ్‌తో, భారీ అంచనాల మధ్య విడుదల చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.

KGF Chapter 2: సౌత్ సినిమా అంటే ఏంటో ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సౌత్ భాషలంటే రీజియనల్ సినిమాలుగా భావించే వారికి సౌత్ స్టామినా చూపించిన మేకర్స్ కొందరు ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక పేరు ప్రశాంత్ నీల్. శాండిల్‌వుడ్ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే.. దానికి కారణం ప్రశాంత్ నీల్ అని చాలామంది ఒప్పుకుంటారు. అయితే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' విడుదల కాకముందే ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన మొదటి చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. కన్నడలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలయిన మొదటి చిత్రం కూడా ఇదే. కేజీఎఫ్ వల్లే శాండిల్‌వుడ్ స్థాయి అమాంతం పెరిగిపోయింది అనడానికి ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 1 అంత రేంజ్‌లో విజయం సాధించినందుకు కేజీఎఫ్ చాప్టర్ 2పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

కేజీఎఫ్ చాప్టర్ 2ను భారీ క్యాస్టింగ్‌తో, భారీ అంచనాల మధ్య విడుదల చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. చాప్టర్ 1 కంటే చాప్టర్ 2పై అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమయ్యింది. అంతే కాకుండా కేజీఎఫ్ చాప్టర్ 2 గ్రీస్ భాషలో కూడా విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఏ సౌత్ ఇండియన్ సినిమా గ్రీస్ భాషలో విడుదల అవ్వలేదు. మరి ఇంత భారీ స్థాయిలో విడుదల అవుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రేక్షకుల అంచనాలను అందుకోగలదో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story