KGF Chapter 3: యశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కేజీఎఫ్ చాప్టర్ 3' కూడా..

Yash (tv5news.in)

Yash (tv5news.in)

KGF Chapter 3: ఇంతటితో కేజీఎఫ్ కథ ముగిసిపోలేదని, కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఉండబోతుందని మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.

KGF Chapter 3: 'కేజీఎఫ్' అనే సినిమా శాండిల్‌వుడ్‌లో పెద్ద సెన్సేషన్నే సృష్టించింది. కన్నడ భాషా పరిశ్రమకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది కేజీఎఫ్. ఇందులో ఎక్కువ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్‌కే వెళ్తుంది. అందుకే ఈ పాన్ ఇండియా సినిమాను ఒకే భాగంలో కాకుండా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శుక్రవారం విడుదలయిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఉండబోతుందని మూవీ టీమ్ అప్పుడే హింట్ ఇచ్చేసింది.

కేజీఎఫ్ చాప్టర్ 1 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో.. చాప్టర్ 2 కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎక్కువయిపోయింది. అయితే విజయ్ నటించిన బీస్ట్ కూడా పాన్ ఇండియా చిత్రంగా కేజీఎఫ్ 2కు పోటీగా ఒకేరోజు తేడాలో విడుదలయ్యింది. విజయ్ ఫ్యాన్స్ కూడా బీస్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఒకవేళ బీస్ట్ వల్ల కేజీఎఫ్ 2పై ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు.

బెనిఫిట్ షో నుండే కేజీఎఫ్ చాప్టర్ 2కు పాజిటివ్ టాక్ లభిస్తోంది. చాప్టర్ 1కంటే 2లోనే ఎక్కువగా ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సినిమా చూసిన వారు రివ్యూ ఇచ్చేస్తున్నారు. అయితే ఇంతటితో కేజీఎఫ్ కథ ముగిసిపోలేదని, కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఉండబోతుందని మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. ఎండ్ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 3 అని స్క్రీన్ పై కనిపించింది. దీంతో యశ్ ఫ్యాన్స్ మరింత ఖుషీ అయిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story