Khiladi Twitter Review: 'ఖిలాడి' ట్విటర్ రివ్యూ.. ఒక పర్ఫెక్ట్ రివెంజ్ డ్రామా..

Khiladi Twitter Review: ఖిలాడి ట్విటర్ రివ్యూ.. ఒక పర్ఫెక్ట్ రివెంజ్ డ్రామా..
Khiladi Twitter Review: ‘ఖిలాడి’ ట్రైలర్ చూస్తే.. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది.

Khiladi Twitter Review: కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత రవితేజ 'క్రాక్' అనే చిత్రంతో వచ్చి హిట్ కొట్టాడు. కొన్నాళ్లుగా ఫ్లాప్స్‌లో ఉన్న రవితేజ కెరీర్‌ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది క్రాక్. ఇప్పుడు మరోసారి కరోనా సెకండ్ వేవ్ తర్వాత 'ఖిలాడి' చిత్రంతో మన ముందుకు వచ్చాడు మాస్ మహారాజ్. ఇప్పటికే ఓవర్సీస్‌లో సినిమాను చూసిన ఆడియన్స్ అందరూ దీనికి రివ్యూలను ఇచ్చేస్తున్నారు.

'ఖిలాడి' ట్రైలర్ చూస్తే.. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. అందులోనూ ముఖ్యంగా ఓ యాక్షన్ సన్నివేశాన్ని ఫారిన్‌లో ప్రత్యేక శ్రద్ధతో తెరకెక్కించాడు దర్శకుడు రమేశ్ వర్మ. ఈ బైక్ చేజింగ్ సీన్ సినిమాకే హైలెట్ అని టాక్. ఇక పూర్తిగా ఖిలాడి రివ్యూ విషయానికొస్తే..

ఖిలాడి సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా.. సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయిందని ట్విటర్ రివ్యూలో తెలిపారు ప్రేక్షకులు. ప్రీ ఇంటర్వెల్ నుండి ఊపందుకునే ఖిలాడి.. క్లైమాక్స్ వరకు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుందని అంటున్నారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, ఉన్ని ముకుందన్ ఎవరి పాత్రలో వారు బాగా అలరించారని సమాచారం.

రవితేజ లిప్ లాక్ సీన్ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అయినా ఇదే సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని టాక్. అంతే కాకుండా ఇప్పటికే ఖిలాడి పాటలు అందరికీ ఫుల్ కిక్ ఇస్తుండగా.. ఇవి థియేటర్లలో కూడా ఆడియన్స్‌తో విజిల్ కొట్టించేలా ఉన్నాయని సమాచారం. పూర్తిగా ఇది ఒక రివెంజ్ డ్రామా అని, ఇందులో రవితేజ యాక్టింగ్ పెద్ద ప్లస్ అంటున్నారు నెటిజన్లు. క్రాక్ తర్వాత ఖిలాడితో రవితేజ మరో హిట్‌ను అందుకున్నట్టే అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఖిలాడి చిత్రం గతేడాది మే 28న విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్ వల్ల కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇన్నిరోజుల ఈ సినిమా కోసం ఎదురుచూసేలా చేసినా కూడా.. ఈ పర్ఫెక్ట్ రివెంజ్ డ్రామా కోసం వెయిట్ చేయవచ్చని ప్రేక్షకులు అంటున్నారు. స్క్రీన్‌పై కనిపించే రవితేజ ఎనర్జీని మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేశాడని ట్విటర్ రివ్యూలో చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story