Acharya: 'ఆచార్య'లో కాజల్ లేదు.. ఎందుకంటే..: కొరటాల శివ

Acharya: ఆచార్యలో కాజల్ లేదు.. ఎందుకంటే..: కొరటాల శివ
Acharya: ఆచార్య టీజర్, ట్రైలర్‌లో ఎక్కడా కాజల్ కనిపించకపోవడంతో సినిమాలో తన సీన్స్‌ను కట్ చేశారా అన్న సందేహాలు మొదలయ్యాయి

Acharya: మెగా హీరోలు రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన చిత్రమే 'ఆచార్య'. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటిసారి తండ్రీ, కొడుకులు కలిసి చేస్తు్న్న మల్టీ స్టారర్ కావడంతో, కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేని కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో ఆచార్య పక్కా హిట్ అని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కాజల్ పాత్రపై ఇటీవల క్లారిటీ ఇచ్చాడు కొరటాల.


కాజల్ అగర్వాల్ ఇప్పటికీ పలువురు మెగా హీరోలతో నటించింది. మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ సినిమాగా వచ్చిన 'ఖైదీ నెంబర్ 150'లో కూడా కాజలే హీరోయిన్‌గా చేసింది. అందుకే 'ఆచార్య'లో కూడా చిరంజీవి సరసన కాజల్ నటిస్తే బాగుంటుందని కొరటాల శివ భావించాడు. హీరోయిన్‌గా తనను ఎంపిక చేసిన సినిమా కూడా పూర్తి చేశాడు. కానీ ఆచార్య టీజర్, ట్రైలర్‌లో ఎక్కడా కాజల్ కనిపించకపోవడంతో సినిమాలో తన సీన్స్‌ను కట్ చేశారా అన్న సందేహాలు మొదలయ్యాయి.


ఆ సందేహాలకు క్లారిటీ ఇస్తూ తాజాగా కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. మొదట సినిమా అనుకున్నప్పుడు హీరోకు జోడీగా హీరోయిన్ ఉంటే బాగుంటుంది అని భావించాడట కొరటాల. అందుకే ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేశారట. నాలుగు రోజులు షూటింగ్ కూడా పూర్తయిన తర్వాత ఆచార్య అనే క్యారెక్టర్‌కు లవ్ ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుందా? బాగుండదా? అనే సందేహం వచ్చిందట కొరటాలకు.


కొంతకాలం ఆలోచించిన తర్వాత నక్సలిజం సిద్ధాంతాలున్న వ్యక్తికి హీరోయిన్ ఉండకపోతేనే బాగుంటుందని డిసైడ్ అయ్యారట. అంతే కాకుండా సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఏదో ఒక పాత్ర రాసి, దానికి అంత పెద్ద హీరోయిన్‌ను తీసుకోవడం కరెక్ట్ కాదని అనుకున్నారట. ఇదే విషయాన్ని కాజల్‌తో చెప్పగా తాను కూడా అంగీకరించిందట. అయితే 'లాహే లాహే' పాటలో కాజల్ పాత్ర కాసేపే కాబట్టి దానిని అలాగే ఉండనిస్తారేమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story