Kotha Bangaru Lokam : 'కొత్త బంగారు లోకం' మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో కొడుకు..!

Kotha Bangaru Lokam : కొత్త బంగారు లోకం  మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో కొడుకు..!
Kotha Bangaru Lokam : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శ్రీకాంత్ అడ్డాలని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం కొత్త బంగారు లోకం..

Kotha Bangaru Lokam : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శ్రీకాంత్ అడ్డాలని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం కొత్త బంగారు లోకం.. శ్వేతా బసు ప్రసాద్ ఈ సినిమాతో హీరోయిన్‌‌గా పరిచయమైంది.. కాలేజీ బ్యాక్ గ్రాప్, టీనేజ్ లవర్ స్టోరీ, సున్నీతమైన భాగోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

దిల్ రాజుకి ఇది ఏడో సినిమా కావడం విశేషం. అయితే ముందుగా ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్యని హీరోగా లాంచ్ చేయాలన్న ప్రపోజల్‌‌ని నాగార్జున ముందుకు తీసుకెళ్ళారట దిల్ రాజు.. సాఫ్ట్ మూవీ కావడం, యాక్షన్ ఎపిసోడ్స్‌‌కి పెద్దగా స్కోప్ లేకపోవడంతో చైతూ డెబ్యూ మూవీకి ఇది కరెక్ట్ కాదని రిజెక్ట్ చేశారట నాగార్జున. ఈ విషయాన్ని దిల్ రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇక ఆ తర్వాత చైతూ ప్లేస్‌‌లో వరుణ్ సందేశ్ ని తీసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో దిల్ రాజు పైన నాగార్జునకి మరింత కాన్ఫిడెంట్ పెరిగిందట.. ఆ తర్వాత జోష్ కథతో నాగార్జునని అప్రోచ్ అయ్యారట దిల్ రాజు.. అది కూడా కాలేజీ బ్యాక్ గ్రాప్ స్టోరీ కావడం, శివ లాంటి టచింగ్ పాయింట్‌‌లు మూవీలో ఉండడంతో నాగచైతన్యని హీరోగా లాంచ్ చేసే ఛాన్స్ దిల్ రాజుకి అప్పగించారట నాగార్జున.

అయితే ఈ కథని ముందుగా రామ్ చరణ్ కి వినిపిస్తే బాగుందని అన్నాడట.. కానీ చిరంజీవి రిజెక్ట్ చేయడంతో కథ నాగార్జున దగ్గరికి వెళ్లిందట. నాగచైతన్యకి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చింది ఈ చిత్రం.

Tags

Read MoreRead Less
Next Story