Krithi Shetty : బాలయ్యకి నో చెప్పిన బేబమ్మ..

Krithi Shetty : బాలయ్యకి నో చెప్పిన బేబమ్మ..
Krithi Shetty : నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌‌లో ఓ సినిమా తెరకెక్కుతుంది.

Krithi Shetty : నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌‌లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి జైబాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా శృతిహాసన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. ఈ మధ్యే సిరిసిల్లాలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.


మొదటి షెడ్యుల్‌లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో బాలయ్యతో ఓ కీలకమైన సన్నివేశం కోసం దర్శకుడు గోపీచంద్, చిత్ర నిర్మాతలు హీరోయిన్ కృతిశెట్టిని సంప్రదించారట.

అయితే ఈ ఆఫర్‌‌ని బేబమ్మ రిజెక్ట్ చేసిందట. వయసు రిత్యా ఆ ఆఫర్‌‌ని కృతిశెట్టి రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అఖండ గ్రాండ్ సక్సెస్ తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలున్నాయి.


ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. #NBK107లో ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ అయితే, మరొకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. 'అఖండ' ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన తర్వాత, బాలయ్య నుంచి వస్తోన్న ఈ మాస్ మసాలా చిత్రం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి సినీ ప్రియులు ఆసక్తిగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story