Jr.NTR: విలాసవంతమైన ఎన్టీఆర్ ఇల్లు.. రూ.25 కోట్లు..

Jr.NTR: విలాసవంతమైన ఎన్టీఆర్ ఇల్లు.. రూ.25 కోట్లు..
Jr.NTR: హైదరాబాద్‌లోని రూ. 25 కోట్ల విలాసవంతమైన ఇంట్లో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నివసిస్తున్నారు.

Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్, సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆర్టిస్టుల లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.


1983 మే 20న జన్మించిన ఎన్టీఆర్ తన నటన కారణంగా దక్షిణాది సినీ పరిశ్రమలో విపరీతమైన పాపులారిటీని సంపాదించాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సౌత్ ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.


సినిమా తెరపై సూపర్ డూపర్ హిట్స్ అందించిన జూనియర్ ఎన్టీఆర్.. వసూళ్ల విషయంలో కూడా చాలా మంది ఇండస్ట్రీ దిగ్గజాలతో పోటీ పడుతున్నాడు. తన అద్భుతమైన నటనకు గాను నంది అవార్డు, IIFA అవార్డు, ఫిల్మ్‌ఫేర్గు అవార్డు వంటి అనేక అవార్డులను గెలుచుకున్నాడు.


ఎన్టీఆర్ కి తన సినీ కెరీర్ లో ఎంత పేరు వచ్చిందో వారి విలాసవంతమైన, అందమైన ఇంటిని చూస్తే సులభంగా అంచనా వేయవచ్చు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేసాడు. ఈ బంగ్లా విలువ రూ. 25 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఇంటితో పాటు బెంగళూరు, కర్ణాటకలో అనేక విలాసవంతమైన గృహాలు ఉన్నాయి.

ప్రముఖ నటులు రామ్ చరణ్, చిరంజీవి.. జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటికి దగ్గరలోనే ఉంటాడు ఎన్టీఆర్. ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ చాలా అందంగా డిజైన్ చేయబడింది. వాల్ పెయింట్ కు సరిపడే ఫర్నిచర్ వారి టేస్ట్ కి అద్ధం పడుతుంది. ఇంటి ఆవరణలో ఉన్న ఊయలలో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తారు ప్రణతి, ఎన్టీఆర్.


2011 సంవత్సరంలో లక్ష్మీ ప్రణితిని వివాహం చేసుకున్న ఎన్టీఆర్ కి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎన్టీఆర్ గొప్ప నటుడే కాదు.. మంచి భర్త, మంచి తండ్రి కూడా. వారి ఫ్యామిలీ ఫోటోలు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని అనిపిస్తుంది.


సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగిసిన తరువాత కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాడు. ఇక ఆయన ఒక్క చిత్రానికి దాదాపు 18 నుంచి 20 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని సమాచారం. భారీ హిట్ కొట్టిన ఆర్ఆర్ఆర్ తరవాత కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నహాలు చేస్తున్నారు ఎన్టీఆర్.

Tags

Read MoreRead Less
Next Story