Mahesh Babu : అన్నయ్య పెద్దకర్మకు హాజరైన మహేశ్​..!

Mahesh Babu : అన్నయ్య పెద్దకర్మకు హాజరైన మహేశ్​..!
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్​మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్​మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో 56 ఏళ్ల రమేశ్​బాబు జనవరి 8న తుది శ్వాస విడిచారు.ఆ సమయంలో మహేష్ కి కరోనా సోకడంతో రమేష్ బాబు అంత్యక్రియలకి హాజరు కాలేకపోయారు. అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న మహేశ్​శనివారం (జనవరి 22) తన అన్నయ్య రమేశ్​బాబు పెద్దకర్మకు హాజరయ్యారు.

అత్యంత సన్నిహితుల మధ్య రమేశ్ బాబు పెద్దకర్మ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా అన్నయ్యతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మహేశ్ బాబు కన్నీటి పర్యంతమైనట్లుగా సమాచారం. అన్నయ్య రమేష్ బాబు అంటే తనకి ఎంత ఇష్టమో మహేష్ బాబు పలు వేదికల పైన చెప్పారు. రమేశ్​బాబు చనిపోయినప్పుడు మహేష్ భావోద్వేగంగా ట్వీట్​ చేసిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story