Balakrishna : జక్కన్న, మహేష్ మూవీలో బాలయ్య... !

Balakrishna : జక్కన్న, మహేష్ మూవీలో బాలయ్య... !
Balakrishna : అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే అనౌన్సు చేశాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

Balakrishna : బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR.. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌‌లు మెయిన్ లీడ్‌‌లో నటించిన ఈ చిత్రంలో అలియా భట్ హీరోయిన్‌‌గా నటించింది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకి మార్చ్ 25 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే అనౌన్సు చేశాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకి నందమూరి బాలకృష్ణని తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యకి పాత్రని వివరించారట జక్కన్న.. అయితే బాలయ్య దీనికి ఓకే చెప్పాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

అయితే మహేష్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోని పూర్తి స్థాయిలో చూసేందుకు ఇష్టపడుతున్నమని ఇందులో మరో హీరో వద్దంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story