Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట రివ్యూ.. మహేష్ ఫ్యాన్స్ కి పండగే.. !

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట రివ్యూ.. మహేష్  ఫ్యాన్స్ కి పండగే.. !
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. సర్కారువారి పాట థియేటర్స్ లోకి వచ్చింది.

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. సర్కారువారి పాట థియేటర్స్ లోకి వచ్చింది. మహేష్ బాబు సినిమా అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ క్రేజ్ ను డబుల్ చేసేలా ప్రమోషన్స్ తో ఆకట్టుకున్నారు. పాటలతో అదరగొట్టారు. రిలీజ్ కు ముందు పోకిరి, దూకుడు రేంజ్ హిట్ అనే కలరింగ్ కనిపించింది. మరి నిజంగానే ఈ చిత్రం ఆ రేంజ్ లో ఉందా లేదా అనేది చూద్దాం..

మహేష్ యూఎస్ఏలో ఉంటూ అందరికీ అప్పులు ఇస్తుంటాడు. అక్కడ చదువుకోవడానికి వెళ్లిన కళావతి అతని వద్ద పదివేల డాలర్లు అప్పుగా తీసుకుంటుంది. మొదట ఆమెను ప్రేమించినా.. డబ్బు వసూలు విషయంలో నిక్కచ్చిగా ఉండే మహేష్ ఆమె మోసం చేసిందని తెలుసుకుంటాడు. తన డబ్బు వసూలు చేయడానికి ఆమెను వెదుక్కుంటూ ఇండియాలోని వైజాగ్ కు వస్తాడు. కళావతి తండ్రి ఓ బిజినెస్ మేన్. అతను కూడా అప్పటికే వెయ్యి కోట్లకు పైగా డబ్బులు ఎగ్గొట్టి బ్యాంకులను మోసం చేసి ఉంటాడు. మరి ఈ క్రమంలో మహేష్ తన డబ్బు ఎలా వసూలు చేసుకున్నాడు. కళావతితో అతని ప్రేమ వ్యవహారం ఏమైందీ అనేది మిగతా కథ.

సినిమాను ఒంటి చేత్తో మోశాడు మహేష్ బాబు. మరీ బలమైన కథ కాకపోయినా.. దీనికి తనదైన శైలిలో మంచి ఎంటర్టైన్మెంట్ ను యాడ్ చేశాడు దర్శకుడు పరశురామ్. ఆ పార్ట్ ను కూడా తన టైమింగ్ తో అదరగొట్టాడు మహేష్. మహేష్, కీర్తిల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్ ఎంటర్టైనర్ లా కనిపించడంతో మాగ్జిమం దూకుడు రేంజ్ సినిమా చూస్తున్నాం అనుకుంటారు ఆడియన్స్. ఆ ఫీల్ తోనే సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అయితే.. కాస్త ఇబ్బందే పెట్టే కథనం కనిపిస్తుంది. అయినా కథనం డౌన్ అయినప్పుడల్లా మహేష్ ఛరిష్మాతో కవర్ చేశాడు. దీంతో చూస్తోన్న ఆడియన్స్ కు ఎక్కడా బోర్ ఫీల్ రాకుండా ఆకట్టుకుంటుందీ చిత్రం. సముద్రఖని పాత్రను ఇంకాస్త బలంగా మలచి ఉంటే బావుండు అనిపిస్తుంది. నదియా, వెన్నెల కిశోర్ ఓకే అనేలా ఉన్నారు.

సినిమాటోగ్రఫీ చాలాబావుంది. తమన్ పాటల్లో రెండు బావున్నాయి. ఎప్పట్లాగే నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. పరశురామ్ మంచి రైటర్. ఆ విషయంలో మరోసారి ప్రూవ్ అయింది. డైలాగ్స్ చాలా బావున్నాయి. అలాగే కథకు కీలకమైన కొన్ని ఎపిసోడ్స్ ను బాగా డీల్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మొత్తంగా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సర్కారువారి పాట సాఫీగా సాగిపోయే సినిమాగా చెప్పొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story