Acharya Trailer : మెగా మాస్ జాతర .. ఆచార్య ట్రైలర్ వచ్చేసింది..!

Acharya Trailer :  మెగా మాస్ జాతర .. ఆచార్య ట్రైలర్ వచ్చేసింది..!
Acharya Trailer : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ ట్రైలర్ రానే వచ్చింది..

Acharya Trailer : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ ట్రైలర్ రానే వచ్చింది.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్ర ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్.. మెగా అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతోంది.

రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో మొదలైన చిత్ర ట్రైలర్ కన్నుల పండుగగా ఉంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో చిరంజీవి, చరణ్ ల మధ్య వచ్చే సీన్స్ గూస్ బంబ్స్ తెప్పిస్తున్నాయి. ఇక ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి ట్రైలల్‌లో కాస్త లేటుగా వచ్చినా... ఆయన ఎంట్రీ లేటెస్టుగా ఉంది.

టీజర్, పాటలతో సినిమా పైన ఇప్పటికే హైప్స్ పెరగగా, ట్రైలర్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పాలి. కొణిదెల, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.


Tags

Read MoreRead Less
Next Story