Naga Chaitanya : నాగచైతన్య సరికొత్త రికార్డు... ఆ రేసులో తొలి హీరో..!

Naga Chaitanya : నాగచైతన్య సరికొత్త రికార్డు... ఆ రేసులో తొలి హీరో..!
Naga Chaitanya : చైతూ గత నాలుగు సినిమాల విషయానికి వస్తే.. మజిలి చిత్రం 40 కోట్ల షేర్ వసూలు చేసింది.

Naga Chaitanya : ఇండస్ట్రీలో టాప్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలుంటారు. టాప్ హీరోల విషయం పక్కన పెడితే మీడియం రేంజ్ హీరోలతో మినిమం బడ్జెట్ మూవీస్ చేస్తే సేఫ్ జోన్ అన్నమాట.. వారిలో రవితేజ, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, నాని, రామ్‌ లాంటి హీరోలుంటారు. మంచి హిట్ అయితే వీరి సినిమాలకి యాబై కోట్లకి పైగానే కలెక్షన్లు వస్తాయి. ఇందులో హీరో నాగచైతన్యకి ముప్పై కోట్ల మార్కెట్ ఉంది. కానీ అంతకుమించి కలెక్షన్లు వరుసగా నాలుగు సార్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు చైతూ..

చైతూ గత నాలుగు సినిమాల విషయానికి వస్తే.. మజిలి చిత్రం 40 కోట్ల షేర్ వసూలు చేసింది. సోలో హీరోగా చైతూకి ఇది అప్పటికి బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలిచింది. ఆ తర్వాత వెంకటేష్‌‌‌తో చేసిన వెంకీ మామ కూడా 58 కోట్లు వసూళ్ళు చేసింది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరి 60 కోట్ల గ్రాస్‌‌ని సాధించింది. తాజాగా తన తండ్రితో కలిసి చేసిన బంగార్రాజు చిత్రం మూడు రోజుల్లో ఏకంగా 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ లెక్కన మీడియం రేంజ్ హీరోలలో వరసగా నాలుగు సార్లు 50 కోట్లు గ్రాస్ అందుకున్న తొలి హీరో నాగచైతన్యనే కావడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story