Naga Chaitanya: సమంత బాటలో నాగచైతన్య.. !!

Naga Chaitanya: సమంత బాటలో నాగచైతన్య.. !!
Naga Chaitanya: చైతన్య కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ ని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు.

Naga Chaitanya: సమంత వరుస పెట్టి అన్ని భాషల్లో నటించేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఏదైనా కథ నచ్చితే కాదనేది లేదంటూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.. మరో పక్క యాడ్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది సామ్. చైతన్య కూడా సమంత బాటలోనే పయనించాలనుకున్నట్లున్నాడు..

తన తదుపరి చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. నాగ చైతన్య 22వ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా 'మనడు' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వెంకట్ ప్రభు. పవన్‌కుమార్‌ సమర్పణలో 'శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌' బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

తమిళంలో నాగ చైతన్యను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే.. తాను కూడా సమంతలాగా అన్ని భాషల్లో పాపులర్ అవ్వాలనే తపన చైతన్యలో కనబడుతోంది. సమంత బాలీవుడ్‌లో ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్‌లో నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆమె మాదిరిగానే చైతన్య కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ ని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. సమంత హిందీలో సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. చైతన్య కూడా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సమంతకు తమిళంలో మంచి స్టార్ డమ్ ఉంది. అందుకే ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో కోలీవుడ్‌కి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు చైతూ కూడా.

నాగ చైతన్య 'మజిలీ', 'వెంకీ మామ', 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' వంటి వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'థాంక్యూ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం అందుకుంటుందని నాగచైతన్య అభిమానులు ఆశిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story