Naga Chaitanya : పండ్లు ఉన్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు : చైతూ

Naga Chaitanya : పండ్లు ఉన్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు : చైతూ
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, సమంత గత ఏడాది తమ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే..

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, సమంత గత ఏడాది తమ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే... అయినప్పటికీ వీరి విడాకుల వ్యవహారం ఇంకా హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది. సామ్‌‌తో విడాకుల పైన చైతూ ఇంతకుముందే స్పందించాడు. ఇద్దరి మంచి కోసం ఈ డెసిషన్‌ తీసుకున్నామని, దీనివల్ల ఇద్దరం సంతోషం ఉన్నామని చెప్పుకొచ్చాడు.

తాజాగా మరోసారి విడాకుల పైన స్పందించాడు చైతూ. తన గురించి ఏం రాసినా పట్టించుకోను కానీ కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు రాయడం తనని బాధించిందని చెప్పుకొచ్చాడు. అయినా పండ్లు ఉన్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు అనే విషయాన్ని తాను బలంగా నమ్ముతానని, అందుకే ఈ విషయం పైన ఎక్కువగా స్పందించనని తెలిపాడు.

ఇక చైతన్య సినిమాల విషయానికి వస్తే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తన తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు మూవీ చేశాడు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి వసూళ్ళను రాబడుతోంది. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో మరో మూవీ చేస్తున్నాడు చైతన్య.

Tags

Read MoreRead Less
Next Story