Nayantara : తిరుమలలో నయనతార పెళ్లి.. ఎప్పుడంటే?

Nayantara : తిరుమలలో నయనతార పెళ్లి.. ఎప్పుడంటే?
Nayanthara : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే..

Nayanthara : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలోని శ్రీవారి సన్నిధిలో నయన్, విఘ్నేష్ ఒక్కటి కానున్నారు.

జూన్ 9న వీరిద్దరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఈరోజు తిరుమల శ్రీవారిని నయనతార, విఘ్నేష్ శివన్ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ తిరుమలలో పెళ్లి వేదిక కోసం పరిశీలించారు.

దీనితో వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. కాగా తాజాగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన, కాతు వాకుల రెండు కాదల్‌లో నయన్ తో పాటుగా సమంత రూత్ ప్రభు మరియు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో నటించారు.

Tags

Read MoreRead Less
Next Story