NBK107 : ఇదేందయ్యా ఇది.. బాలయ్య సినిమా ఆ కన్నడ సినిమాకి రీమేకా?

NBK107 : ఇదేందయ్యా ఇది.. బాలయ్య సినిమా ఆ కన్నడ సినిమాకి రీమేకా?
NBK107 : నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

NBK107 : నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. జై బాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.


ఇటీవలే రాజన్నసిరిసిల్లా జిల్లాలో సినిమా షూటింగ్ మొదలైంది. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. షూటింగ్ నుంచి ఓ లుక్ కూడా లీక్ అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


కన్నడంలో హిట్ అయిన మఫ్టీ సినిమాకి ఇది రీమేక్ అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శివరాజ్‌కుమార్ హీరోగా నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన మఫ్టీ సినిమా 2017లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది.


లీకైన బాలయ్య లుక్, మఫ్టీ సినిమాలో శివరాజ్‌కుమార్ లుక్ ఓకే విధంగా ఉండడంతో ఆ సినిమాకి ఇది రీమేక్ అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే అది వాస్తవం కాదని స్ట్రయిట్ సినిమానే అని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నారు. దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది. దసరాకి సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story