Nithiin : అక్కినేని హీరోలతో నితిన్ బిగ్ ఫైట్..!

Nithiin : అక్కినేని హీరోలతో నితిన్ బిగ్ ఫైట్..!
Nithiin : యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం.. ఎం.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Nithiin : యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం.. ఎం.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాని మే12న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ సినిమాకి ఒకరోజు ముందు ఒకరోజు తరువాత అక్కినేని బ్రదర్స్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి... నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు... ఈ సినిమాలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ లు కూడా నటిస్తున్నారు.

భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్ట్ 11న థియేటర్లలోకి రానుంది. అటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తోన్న స్పై థ్రిల్లర్ డ్రామా ఏజెంట్ ఆగస్టు 12న థియేటర్లలోకి రానుంది. అంతేకాకుండా నాగచైతన్య మాజీ భార్య సమంత నటిస్తోన్న యశోద చిత్రం కూడా ఆగష్టు 12నే విడుదల కానుంది. మొత్తానికి అక్కినేని హీరోల సినిమాలతో నితిన్ బిగ్ ఫైట్ కి సిద్దమయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story