Samantha : రెమ్యునరేషన్‌‌లో సామ్ టాప్ 2.. ఫస్ట్ ఎవరంటే...!

Samantha : రెమ్యునరేషన్‌‌లో సామ్ టాప్ 2.. ఫస్ట్ ఎవరంటే...!
Samantha : టాలీవుడ్‌‌లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ లలో సమంత ఒకరు... 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' తర్వాత నార్త్‌‌లో కూడా క్రేజ్‌‌ని పెంచుకుంది సామ్.

Samantha : టాలీవుడ్‌‌లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ లలో సమంత ఒకరు... 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' తర్వాత నార్త్‌‌లో కూడా క్రేజ్‌‌ని పెంచుకుంది సామ్.. గతేడాది అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి మరింత ఫేమ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె రెమ్యునరేషన్ అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. లేడీ సూపర్ స్టార్ నయనతార తర్వాత సౌత్ ఇండియన్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే రెండవ నటిగా సామ్ కొనసాగుతోంది.

సమంత ఒక్కో చిత్రానికి రూ. 3 కోట్లు వసూలు చేస్తుందని తెలుస్తోంది. నయనతార ఒక్కో సినిమాకు దాదాపు రూ.5-6 కోట్లు తీసుకుంటుందట. ఇక పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు గాను సామ్ రూ. 1.5 కోట్లు తీసుకుందని సమాచారం. ఇక సమంత విషయానికి వచ్చేసరికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'కాతువాకుల రెండు కాదల్'లో ఓ ప్రధాన పాత్రలో నటించింది... ఈ సినిమాలో ఆమెతో పాటుగా నయనతార, విజయ్ సేతుపతి కూడా నటించారు. ఇక తెలుగులో శాకుంతలం మూవీని ఫినిష్ చేసిన ఆమె.. యశోద షూటింగ్‌‌లో బిజీగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story