సినిమా

RRR నుంచి NTR వీడియో.. ప్రమోషన్స్ పీక్స్..!

NTR_ RRR : టాలీవుడ్ మాత్రమే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఎదురుచూస్తోన్న సినిమా త్రిబుల్ ఆర్.

RRR నుంచి NTR వీడియో.. ప్రమోషన్స్ పీక్స్..!
X

NTR_ RRR : టాలీవుడ్ మాత్రమే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఎదురుచూస్తోన్న సినిమా త్రిబుల్ ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి. సినిమా రిలీజ్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ పైన ఫోకస్ పెట్టాడు రాజమౌళి.. అందులో భాగంగానే షార్ట్ వీడియోస్‌‌‌తో ప్రమోషన్‌‌‌ని పీక్స్ స్టేజ్‌‌‌కి తీసుకెళ్తున్నాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్‌‌కి సంబంధించిన ఓ వీడియోని మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. నీటిలో నుంచి ఎన్టీఆర్ పైకి వస్తున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. ఉన్నది కొద్దిసేపే అయినప్పటికీ విజువల్ పరంగా ఆసక్తిని రేకెత్తించారు రాజమౌళి. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌‌‌‌లో ట్రెండింగ్ లో ఉంది. కాగా నిన్న వరుసగా రామ్ చరణ్, అజయ్ దేవగన్, మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు.


Next Story

RELATED STORIES