pawan Kalyan : ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని సత్కరించిన పవన్ కల్యాణ్.. !

pawan Kalyan : ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని సత్కరించిన పవన్ కల్యాణ్.. !
Pawan Kalyan : ప్రముఖ కళా దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత తోట తరణిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్కరించారు.

pawan Kalyan : ప్రముఖ కళా దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత తోట తరణిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్కరించారు. క్రిష్ డైరెక్షన్ లో పవన్ హరిహర వీరమల్లు అనే సినిమాని చేస్తున్నారు.. ఈ సినిమాకి తోటతరణి సెట్స్ వేశారు. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ షూటింగ్ మళ్ళీ హైదరాబాద్ లో మొదలైంది.

ఈ సందర్భంగా షూటింగ్ సెట్లో తోట తరణిని సత్కరించారు పవన్.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "పద్మశ్రీ పురస్కారం, జాతీయ స్థాయి ఉత్తమ కళా దర్శక పురస్కారాలు అందుకున్న తోట తరణి గారి నేతృత్వంలో ఈ చిత్రం సెట్స్ రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన రూపొందించిన సెట్స్ సృజనాత్మక శక్తి, అధ్యయన అభిలాషకు అద్దం పడతాయి. నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి తరణి గారితో పరిచయం ఉంది" అని అన్నారు.

కాగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనుంది. . మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story