Poonam Kaur: మరో కాంట్రవర్సీలో పూనమ్ కౌర్.. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంటూ..

Poonam Kaur (tv5news.in)

Poonam Kaur (tv5news.in)

Poonam Kaur: తాజాగా తన అప్‌కమింగ్ సినిమా ప్రెస్ మీట్‌లో పూనమ్ కౌర్ పాల్గొంది.

Poonam Kaur: కొందరు నటీనటులు సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నా.. లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలా అప్పుడప్పుడు వారు ఇచ్చే స్టేట్‌మెంట్స్ చాలా కాంట్రవర్సీలకు దారితీస్తాయి కూడా. ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియా కాంట్రవర్సీల్లో వినిపిస్తున్న హీరోయిన్ పేరు పూనమ్ కౌర్. తాజాగా పూనమ్ కౌర్ మీడియా ముందుకు వచ్చి గత కొన్నిరోజులుగా తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది.


పూనమ్ కౌర్ చేసిన సినిమాల సంఖ్య ఎక్కువే. కానీ అందులో సూపర్ హిట్ అయ్యి.. తనకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన చిత్రాలు ఒక్కటి కూడా లేవు. తెలుగు, తమిళ, మలయాళంలో చాలా చిత్రాల్లో నటిగా, సహాయ నటిగా గుర్తింపు మాత్రం తెచ్చుకోగలిగింది పూనమ్. అలాంటి తను చాలాకాలం తర్వాత హీరోయిన్‌గా మళ్లీ ప్రేక్షకులను పలకరించనుంది.


తాజాగా తన అప్‌కమింగ్ సినిమా ప్రెస్ మీట్‌లో పూనమ్ కౌర్ పాల్గొంది. అయితే చాలారోజుల తర్వాత ఇలా ఓ సినిమా కోసం అందరినీ కలుస్తున్నానన్న విషయం గుర్తుచేసుకొని స్టేజ్‌పైనే ఎమోషనల్ అయ్యింది పూనమ్. ఒకానొక సమయంలో తాను సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలని అనుకుందని చెప్పడంతో పాటు పలు షాకింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది పూనమ్.


2017లోనే తాను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోవాలనుకున్న విషయాన్ని బయటపెట్టింది పూనమ్ కౌర్. ఇదే విషయాన్ని తన తల్లితో కూడా పంచుకుందట. కానీ సినిమాలే తనను ఆపేశాయంటూ చెప్పుకొచ్చింది. రోజూ సీత, దుర్గా, ద్రౌపదిలనే తలచుకునేదని, దాని వల్ల చాలా శక్తిని, ధైర్యం వచ్చాయని తెలిపింది. అప్పుడే తనకు ఈ సినిమా అవకాశం వచ్చిందంటూ స్పష్టం చేసింది.


పెళ్లి చేసుకొని, అమెరికా వెళ్లిపోవాలనుకున్న పూనమ్ మళ్లీ సినిమాల్లోకి వస్తుందని అస్సలు ఊహించలేదట. జరిగిపోయినదాన్ని లైట్ తీసుకున్నానంటూ తన జీవితంలోని చేదు అనుభవాల గురించి పరోక్షంగా చెప్పింది. ఇండస్ట్రీలో కొందరు తన జీవితాన్ని నాశనం చేశారంటూ అంటూ మరోసారి తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది పూనమ్.

Tags

Read MoreRead Less
Next Story