Poonam Kaur: ప్రభాస్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర కామెంట్స్..

Poonam Kaur: ప్రభాస్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర కామెంట్స్..
Poonam Kaur: ప్రస్తుతం పూనమ్ కౌర్ ఏం మాట్లాడినా.. అది చాలావరకు కాంట్రవర్సీకి దారితీస్తోంది.

Poonam Kaur: ప్రస్తుతం పూనమ్ కౌర్ ఏం మాట్లాడినా.. అది చాలావరకు కాంట్రవర్సీకి దారితీస్తోంది. ఇప్పటికే ట్విటర్ వేదికగా పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్.. తాజాగా ప్రభాస్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్రస్తుతం అంతటా 'రాధే శ్యామ్' మ్యానియా నడుస్తుండగా.. ప్రభాస్‌పై పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'రాధే శ్యామ్'కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. విక్రమాదిత్య, ప్రేరణ పాత్రలకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా చాలామంది రాధే శ్యామ్ షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను పంచుకున్నారు. అందులో చాలావరకు యాక్టర్స్.. ప్రభాస్ గురించి చాలా మంచిగా చెప్పారు. తాజాగా పూనమ్ కౌర్ కూడా ప్రభాస్ క్యారెక్టర్ చాలా మంచిదంటూ చెప్పుకొచ్చింది.

సినీ పరిశ్రమలో స్టార్స్, యాక్టర్స్ అనేవారు చాలామంది ఉన్నారని తెలిపింది పూనమ్ కౌర్. కానీ ఒక మనిషిని నమ్మి అయిదు సంవత్సరాలు ఒకే మూవీకి కేటాయించడం చాలా గొప్ప విషయమంది పూనమ్. ప్రభాస్ లుక్స్, క్రేజ్ పక్కన పెడితే.. నమ్మిన వాళ్ల కోసం నిలబడడమే ప్రభాస్ క్యారెక్టర్ అంటూ తెగ కాంప్లిమెంట్స్ ఇచ్చేసింది. తనకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టమని, అలాగే 'రాధే శ్యామ్' కూడా తనకు నచ్చుతుంది అని తెలిపింది పూనమ్ కౌర్.

Tags

Read MoreRead Less
Next Story