Poonam Kaur : పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ .. కాసేపటికే డిలీట్..!

Poonam Kaur : పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ .. కాసేపటికే డిలీట్..!
Poonam Kaur : సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు సినీ నటి పూనమ్ కౌర్.. సోషల్ మీడియాలో ఆమె ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే..

Poonam Kaur : సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు సినీ నటి పూనమ్ కౌర్.. సోషల్ మీడియాలో ఆమె ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే.. ఒక్కోసారి ఆమె చేసే ట్వీట్స్ బాగా వైరల్ అవుతుంటాయి.. తాజాగా ఓ ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది పూనమ్.. రాజకీయాలు ఎంటర్‌‌టైన్మెంట్ గా, ఎంటర్‌‌టైన్మెంట్ రాజకీయాలుగా మారుతున్నాయి అని ట్వీట్ చేసింది.

అయితే దీనికి ముందు మరో ట్వీట్ చేసింది పూనమ్.. అందులో.. " నేను మనస్పూర్తిగా ఆదరించి, ప్రేమించే వ్యక్తులు.. ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళను వాళ్ళు తక్కువ చేసుకొని చేతులు కట్టుకొని ఉండడం బాధనిపిస్తోంది. వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి" అని రాసి దానికి బ్రోకెన్ హార్ట్ సింబల్స్ జోడించింది. అయితే కాసేపటికే ఈ ట్వీట్ ని పూనమ్ డిలీట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.




కాగా శ్రీకాంత్ హీరోగా వచ్చిన మాయాజాలం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూనమ్.. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాలలో నటించింది.


Tags

Read MoreRead Less
Next Story