Sreeleela : ప్రభాస్ తో శ్రీలీల...క్రేజీ ఛాన్స్ కొట్టేసిందిగా..!

Sreeleela : ప్రభాస్ తో  శ్రీలీల...క్రేజీ ఛాన్స్ కొట్టేసిందిగా..!
Sreeleela : శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్‌‌కు హీరోయిన్‌‌గా పరిచయమైంది శ్రీలీల..

Sreeleela : శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్‌‌కు హీరోయిన్‌‌గా పరిచయమైంది శ్రీలీల.. మొదటి సినిమాతోనే అటు గ్లామర్ షోతోనూ, ఇటు యాక్టింగ్ తో అదరగొట్టి మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ.. ఇప్పుడీ అమ్ముడుకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ఇప్పటికే రవితేజ ధమఖా మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ మూవీలో క్రేజీ ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'రాజా డీలక్స్‌' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లకి స్కోప్ ఉండగా మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్, శ్రీలలని ఇప్పటికే ఎంపిక చేసినట్టుగా ప్రచారం నడుస్తోంది. మరో హీరోయిన్ గా బాలీవుడ్ భామని అనుకుంటున్నారట.. కాగా ఈ సినిమాని మార్చి 18న హోలీ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్సు చేయనున్నారట.

Tags

Read MoreRead Less
Next Story