Prabhas: ప్రభాస్‌కు సర్జరీ.. నెలరోజులు బెడ్ రెస్ట్..

Prabhas (tv5news.in)

Prabhas (tv5news.in)

Prabhas: స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రభాస్ గాయానికి శస్త్రచికిత్స జరిగిందట.

Prabhas:ఇటీవల 'రాధే శ్యామ్'తో తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. చాలాకాలం తర్వాత తమ అభిమాన హీరోను స్క్రీన్‌పై చూస్తున్నామని ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. లవ్ స్టోరీస్ బాగా ఇష్టపడేవారికి రాధే శ్యామ్ ఇప్పటికే ఫేవరెట్ సినిమాగా మారిపోయింది. తాజాగా షూటింగ్‌లో జరిగిన గాయం వల్ల ప్రభాస్‌కు సర్జరీ జరగనుంది అన్న వార్త తన ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.

ప్రస్తుతం ప్రభాస్ అస్సలు తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఉన్నాడు. ఏకంగా అయిదు సినిమాలలో తాను హీరోగా నటిస్తుండగా.. అందులో 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టుకుంది. అయితే కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'సలార్' చిత్రం షూటింగ్ సమయంలో తనకు గాయమైనట్టు కథనాలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ గాయానికి శస్త్రచికిత్స కోసం స్పెయిన్ వెళ్లాడట ప్రభాస్.

స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రభాస్ గాయానికి శస్త్రచికిత్స జరిగిందట. సర్జరీ వల్ల కనీసం నెలరోజులు ప్రభాస్‌కు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారట. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ సినిమాల షూటింగ్స్‌కు మరోసారి ఓ నెలరోజులు బ్రేక్ తప్పదని అర్థమవుతోంది. అయితే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ప్రభాస్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story