Kajal Aggarwal: మూర్ఖుల కోసం ఓ సందేశం.. కాజల్‌కి హ్యాట్సాఫ్ చెప్పిన సమంత

Kajal Aggarwal: మూర్ఖుల కోసం ఓ సందేశం.. కాజల్‌కి హ్యాట్సాఫ్ చెప్పిన సమంత
Kajal Aggarwal: స్త్రీకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం తల్లి కావడం.. బిడ్డను ప్రసవించడం అంటే మళ్లీ జన్మఎత్తడమే..

Kajal Aggarwal: స్త్రీకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం తల్లి కావడం.. బిడ్డను ప్రసవించడం అంటే మళ్లీ జన్మఎత్తడమే.. అయినా సంతోషంగా స్వీకరిస్తుంది.. గర్భదారణ సమయంలో వచ్చే మార్పులను ఆనందంగా ఆహ్వానిస్తుంది. గౌతమ్ కిచ్లూతో జీవితాన్ని పంచుకున్న టాలీవుడ్ చందమామ కాజల్.. ఇప్పుడు తల్లి కాబోతోంది.. గత కొన్ని రోజులుగా ఆ విషయానికి సంబంధించి పోస్టులు పెడుతూ అభిమానులకు హింట్ ఇచ్చింది.

అయితే ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో మార్పులు సహజంగా జరుగుతుంటాయి. వాటిని అంగీకరించాలి. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరిగేందుకు డాక్టర్ సూచన మేరకు పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే తల్లి తీసుకుంటే ఆ ఆహారం బిడ్డకు అందుతుంది.

ఈ క్రమంలో బాడీలో మార్పులు సహజం. డెలివరీ అయి బిడ్డకు ఫీడింగ్ అందిస్తున్నంతకాలం ఆమె తన శరీరంపై శ్రద్ధ పెట్టదు. బిడ్డ ఆరోగ్యం గురించే ఆలోచిస్తుంది.. అదే అమ్మ గొప్పతనం. ఆ విషయం తెలిసిన వారెవరు బాడీ షేమింగ్ గురించి మాట్లాడరు.

నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మీరే నష్టపోతారు.. మీరు చేసే మెసేజెస్, మీమ్స్‌ నేను ఏమాత్రం స్వీకరించను. ప్రస్తుతం నా ఆరోగ్యంతో పాటు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం మాత్రంమే నాకు ముఖ్యం.. మీ మూర్ఖపు ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టండి..

మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారు కదా.. వాళ్లని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇతరుల పట్ల దయతో ఉండడం నేర్చుకోండి. నవ్వుతూ బ్రతకాలి.. నలుగురిని బ్రతికించాలి. అంతే కానీ మాటలతో వేధించకూడదు. ఎవరైతే ఇలాంటి పరిస్థితిని లైఫ్‌లో ఫేజ్ చేస్తున్నారో వారు, ఇలా ట్రోల్ చేసే మూర్ఖులు తప్పనిసరిగా ఈ పోస్ట్‌ని చదవాలి.

ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్స్‌లో మార్పులు అధికంగా ఉంటాయి. బేబీ పెరిగేకొద్దీ శరీరం చాలా అలసటకు గురవుతుంది. మూడ్ స్వింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. నెగెటివ్ ఆలోచలన వలన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. డెలివరీ అయిన తరువాత ఇంతకు ముందులా మారడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు.. లేకపోతే మొత్తానికి మారకపోవచ్చు. అయినా పర్లేదు. ఈ మార్పులు చాలా సహజం. ఇలాంటి అందమైన సందర్భాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించాలి.

నేను ఈ సమయంలో ఒత్తిడిని అధిగమించేందుకు కొన్ని పద్దతులు అవలంభిస్తుంటాను. అందులో భాగంగా ప్రాణాయామం, యోగా, మసాజ్, గార్డెనింగ్, మ్యూజిక్ వినడం, సన్నిహితులతో సంభాషణ వంటివి చేస్తూ రోజంతా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటానని చెప్పింది కాజల్. కాజల్‌కి సపోర్ట్ చేస్తూ రాశి ఖన్నా, సమంత, మంచు లక్ష్మి కామెంట్స్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story