Priyanka Chopra: సెలబ్రెటీల చూపు,, సరోగసీ వైపు.. ప్రియాంక చోప్రాతో పాటు చాలా మంది..

Priyanka Chopra: సెలబ్రెటీల చూపు,, సరోగసీ వైపు.. ప్రియాంక చోప్రాతో పాటు చాలా మంది..
Priyanka Chopra: దంపతులకు వైద్యపరమైన సమస్య ఉన్నట్లయితే, స్త్రీ ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనాస్ శుక్రవారం తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో తమ మొదటి బిడ్డను స్వాగతించామని ప్రకటించారు. జనవరి 21వ తేదీ రాత్రి వీరు సరోగేట్‌ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని తెలిపారు.



"మేము సరోగేట్ ద్వారా బిడ్డను స్వాగతించామని తెలియజేయుటకు చాలా సంతోషిస్తున్నాము" అని ఇన్‌స్టాలో పేర్కొంది ప్రియాంక చోప్రా. 2018లో, ఈ జంట నాలుగు నెలల పాటు డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకున్నారు. సరోగసీ గురించి అవగాహన ఉన్నా సరే ప్రియాంక చోప్రా ద్వారా మళ్లీ ఈ పేరు తెరపైకి వచ్చింది.. నెటిజన్లు సరోగసీ గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు..

సరోగసీ అంటే..



ఒక జంట బిడ్డను కనేందుకు మరొక స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకునే ప్రక్రియను సరోగసీ అంటారు. భర్త నుంచి వీర్యాన్ని సేకరించి మరొక మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. సరోగసీ ద్వారా బిడ్డను కనడం వెనుక చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు, దంపతులకు వైద్యపరమైన సమస్య ఉన్నట్లయితే, స్త్రీ ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. లేదా గర్భం కారణంగా ఏదైనా ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటే ఆ స్త్రీ బిడ్డను కనలేదు.. అప్పుడు సరోగసీ వైపు మొగ్గు చూపుతారు. తన కడుపులో మరొకరి బిడ్డను పెంచే స్త్రీని సరోగేట్ మదర్ అంటారు.



అద్దె గర్భం కోసం, బిడ్డను కనాలనుకునే దంపతులకు, అద్దె తల్లికి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. దీని ప్రకారం తల్లిదండ్రులు.. సరోగేట్ తల్లికి గర్భధారణ సమయంలో వైద్య అవసరాల కోసం డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. సరోగసీ స్త్రీకి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలను బిడ్డను కోరుకునే దంపతులు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఆమె గర్భధారణ సమయంలో తన బాగోగులను తాను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది.

సరోగసీ రెండు రకాలు..



తండ్రి లేదా దాత యొక్క శుక్రకణం. సరోగేట్ తల్లి అండాలతో సరిపోల్చే సంప్రదాయ పద్దతి. రెండవ పద్దతిలో తండ్రి స్పెర్మ్, తల్లి అండానికి కలిపి ల్యాబ్‌లో ప్రాసెస్ చేస్తారు. అది సక్సెస్ అయిన తరువాత దానిని అద్దె తల్లి గర్భాశయంలోకి ప్రవేశ పెడతారు.

భారతదేశంలో సరోగసీ



భారతదేశంలో సరోగసీ దుర్వినియోగం అవుతోందని అనేక అభియోగాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది పేద మహిళలు అద్దె తల్లులుగా మారుతున్నారు. ఈ రకమైన సరోగసీని ప్రభుత్వం నిషేధించింది. ఈ విధమైన సరోగసీని 2019లోనే నిషేధించారు. ఆ తర్వాత సరోగసీకి సంబంధించిన నియమ నిబంధనలను కఠినతరం చేసింది.



దీని కింద, విదేశీయులు, ఒంటరి తల్లిదండ్రులు, విడాకులు తీసుకున్న జంటలు, లివ్-ఇన్ భాగస్వాములు, LGBT కమ్యూనిటీకి చెందిన వ్యక్తులకు సరోగసీ ద్వారా బిడ్డను కనే అర్హత లేదు.సరోగసీ తల్లి తప్పనిసరిగా మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, అప్పుడే ఆమె సరోగసీ మదర్ కాగలదు. మరోవైపు సరోగసీని ఆశ్రయించే దంపతులు సంతానం లేని వారని వైద్య ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.

2020లో సరోగసీ నియంత్రణ బిల్లులో అనేక సంస్కరణలు చేయబడ్డాయి. ఇందులో 'ఆసక్తి' ఉన్న మహిళ ఎవరైనా సరే సరోగేట్‌గా ఉండేందుకు అనుమతించారు.

కరోనా కాలంలో సరోగసీ కేసులు

కరోనా మహమ్మారి తర్వాత గత రెండేళ్లుగా నిరుద్యోగం కారణంగా, అద్దె తల్లుల సంఖ్య కూడా పెరిగింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి అద్దె గర్భాన్ని స్వీకరించే మహిళల సంఖ్య ఎక్కువైంది. కుటుంబ అవసరాలకోసమో, పిల్లలను సరిగ్గా చూసుకునేందుకు సరైన సంపాదన లేకనో లేదా వైద్య ఖర్చుల కోసమో మహిళలు సరోగసీ వైపు మొగ్గు చూపుతున్నారు.

చాలా మంది బాలీవుడ్ నటీనటులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులయ్యారు. ప్రీతీ జింటా, శిల్పాశెట్టి, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్ మరియు తుషార్ కపూర్ వంటి చాలా మంది తారలు సరోగసీని ఆశ్రయించారు. టాలీవుడ్‌లో మంచులక్ష్మీ కూడా సరోగసీ ద్వారానే బిడ్డలను కన్నారు.

Tags

Read MoreRead Less
Next Story