Ram Gopal Varma: ఆర్జీవీపై నిర్మాత కేసు.. సినిమా ఆపేయాలని కోర్టు తీర్పు..

Ram Gopal Varma: ఆర్జీవీపై నిర్మాత కేసు.. సినిమా ఆపేయాలని కోర్టు తీర్పు..
Ram Gopal Varma: ఆర్జీవీ తనకు రూ.5 కోట్ల 29 లక్షలు ఇవ్వాల్సి ఉందని తాజాగా నిర్మాత నట్టికుమార్ కోర్టులో కేసు వేశాడు.

Ram Gopal Varma: ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఏ పని చేసినా.. వర్మ స్టైలే వేరు. అందుకే చాలామంది ఆయనను ఫాలో అవ్వాలి అనుకుంటారు. అలాంటి వర్మ పుట్టినరోజు నేడు. కానీ పుట్టినరోజు నేడు వర్మకు ఊహించని షాక్ తగిలింది. ఓ నిర్మాత ఆయనపై కేసు వేశాడు. దీని కారణంగా వర్మ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.

తెలుగులోనే మొదటి లెస్బియన్ స్టోరీగా వస్తున్న సినిమా 'మా ఇష్టం'. ముందుగా దీనికి 'డేంజరస్' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశాడు దర్శకుడు వర్మ. ఆ టైటిల్‌తోనే సినిమా పాపులర్ అయ్యింది కూడా. శుక్రవారం డేంజరస్ సినిమా విడుదల సందర్భంగా హీరోయిన్స్‌తో కలిసి ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా జోరుగా సాగించాడు ఆర్జీవి. కానీ ఇంతలోనే మూవీ టీమ్‌కు పెద్ద షాక్ తగిలింది.

ఆర్జీవీ తనకు రూ.5 కోట్ల 29 లక్షలు ఇవ్వాల్సి ఉందని తాజాగా నిర్మాత నట్టికుమార్ కోర్టులో కేసు వేశాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే వర్మ తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపించాడు. అంతే కాకుండా ప్రతీ సినిమాకు రూ.50 లక్షలు ఇవ్వాలన్న ఒప్పందాన్ని కూడా వర్మ పట్టించుకోవట్లేదన్నారు. దీంతో కోర్టు మా ఇష్టం సినిమాను ఆపేయాలంటూ తీర్పునిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story