Radhe Shyam: ముద్దు సీన్లు.. సెట్‌లో ఎవరూ లేకుండా చూసి.. : ప్రభాస్

Radhe Shyam: ముద్దు సీన్లు.. సెట్‌లో ఎవరూ లేకుండా చూసి.. : ప్రభాస్
Radhe Shyam: ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న రాథేశ్యామ్ గురించి మాట్లాడుకునేలా ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్.

Radhe Shyam: బాహుబలి అతడిని పాన్‌ఇండియా హీరోని చేసింది. హాలీవుడ్ రేంజ్‌లో తీసిన సాహో అతడి ఇమేజ్‌ని మరింత పెంచింది. రాధాకృష్ణ డైరెక్షన్లో వస్తున్న రాథేశ్యామ్‌పై ప్రభాస్ అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న రాథేశ్యామ్ గురించి మాట్లాడుకునేలా ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.


ఈ సినిమా ఓ అందమైన ప్రేమ కథ. అందుకే రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. ఆ సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు.. ఇది ప్రేమకథ కాబట్టి నో చెప్పలేను. కమర్షియల్ సినిమాలో మనం తప్పించుకోవచ్చు కానీ లవ్ స్టోరీలంటే అది కావాలి కాబట్టి చేయక తప్పలేదు. అయితే ఇలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు షూటింగ్ సమయంలో వీలైనంత వరకు సెట్‌లో ఎవరూ లేకుండా ఉండేలా చూసుకోవాలని డైరెక్టర్‌కి ముందే సూచించినట్లు ప్రభాస్ వెల్లడించారు. హీరోయిన్‌ని ముద్దు పెట్టుకోవడానికి, అలాగే షర్ట్ విప్పడానికి తానెంతో ఇబ్బంది పడ్డానని తెలిపారు.


రాధే శ్యామ్ అనేది 1970లలో యూరప్‌లో జరిగిన ప్రేమకథ. ఈ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తుండగా, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ క్యూట్ లవ్ స్టోరీ చూడాలంటే ఫ్యాన్స్ ఇంకో వారం ఓపికపట్టాలి.

Tags

Read MoreRead Less
Next Story