Radhe Shyam : భీమ్లానాయక్ రికార్డుని బ్రేక్ చేయనున్న రాధేశ్యామ్...!

Radhe Shyam : భీమ్లానాయక్  రికార్డుని బ్రేక్   చేయనున్న రాధేశ్యామ్...!
Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హస్తసాముద్రికుడి పాత్రలో నటించిన పీరియాడికల్ రొమాంటిక్ మూవీ 'రాధేశ్యామ్'.

Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హస్తసాముద్రికుడి పాత్రలో నటించిన పీరియాడికల్ రొమాంటిక్ మూవీ 'రాధేశ్యామ్' .. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ మూవీ మార్చి 11న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతుందని అందరు భావిస్తున్నారు. అయితే రాధేశ్యామ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో భీమ్లానాయక్ మూవీని బీట్ చేయనుంది.


హైదరాబాద్‌లో ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయల మార్కును దాటింది. ఇంకా పలు థియేటర్లలలో బుకింగ్స్ తెరవలేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మెయిన్ లీడ్‌‌లో వచ్చిన భీమ్లానాయక్ చిత్రం హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 4.73 కోట్లు సంపాదించింది.. ఇప్పుడు రాధేశ్యామ్ రూ. 4 కోట్ల మార్కులను దాటింది. బుకింగ్ ఇంకా జరుగుతుంది కాబాట్టి ఈజీగా భీమ్లానాయక్ బుకింగ్ రికార్డుని రాధేశ్యామ్ బ్రేక్ చేస్తుందని అంటున్నారు నిపుణులు. కాగా పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తోన్న ఈ సినిమాని జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించారు.


UV క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ, కృష్ణంరాజు, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story