Rajamouli: కొత్త కారు కొన్న రాజమౌళి.. ధర ఎంతంటే..?

Rajamouli: కొత్త కారు కొన్న రాజమౌళి.. ధర ఎంతంటే..?
Rajamouli: రాజమౌళి దగ్గర ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు ఉండగా ఆయన తాజాగా వోల్వో ఎక్స్ సీ 40 ఎస్ యూవీని కొనుగోలు చేశాడు.

Rajamouli: 'ఆర్ఆర్ఆర్' సినిమా మూవీ టీమ్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. హీరోలకు పాన్ ఇండియా గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎన్ని సినిమాలు విడుదలవుతూ ఉన్నా.. ఆర్ఆర్ఆర్ మాత్రం ఇంకా థియేటర్లలో ప్రేక్షకులతో సక్సెస్‌‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఆర్ఆర్ఆర్ విడుదలయ్యి నెలరోజులు దాటినా.. ఇంకా కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు ఈ సినిమా. ఈ సందర్భంగా రాజమౌళి తన గ్యారేజ్‌లో కొత్త కారును యాడ్ చేశాడు.

రాజమౌళి దగ్గర ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు ఉండగా ఆయన తాజాగా వోల్వో ఎక్స్ సీ 40 ఎస్ యూవీని కొనుగోలు చేశాడు. దీని ఖరీదు రూ.44.50 లక్షలుగా సమాచారం. ఇక దీని ఫీచర్స్ విషయానికొస్తే.. 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో కారుకు పవర్ నిచ్చారు. ఈ ఇంజన్ తో 187 బీహెచ్ పీ వద్ద 300 నానోమీటర్ల టార్క్ను జనరేట్ చేస్తుంది. అంతే కాకుండా దీనికి 8 గేర్లు ఉండడం విశేషం.

రాజమౌళి ఈ కారును కొనుగోలు చేసిన విషయాన్ని వోల్వో సంస్థ స్వయంగా ప్రకటించింది. తను కారు కీ అందుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'దర్శకుడు, రచయిత రాజమౌళి గారికి వోల్వో ఫ్యామిలీలోకి స్వాగతం. ఆయన ప్రయాణాలు సురక్షితంగా, సౌకర్యంతో పాటు ఆయన విజన్‌లాగానే గ్రాండ్‌గా కూడా ఉండాలని కోరుకుంటున్నాం' అని వోల్వో సంస్థ పోస్ట్‌లో తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story