Rajamouli : టాలీవుడ్‌‌కి కొత్త పద్ధతి నేర్పిన జక్కన్న..!

Rajamouli (tv5news.in)

Rajamouli (tv5news.in)

Rajamouli : బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళాడు దర్శకధీరుడు రాజమౌళి.

Rajamouli : బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళాడు దర్శకధీరుడు రాజమౌళి. టాలీవుడ్ ఇండస్ట్రీని బాహుబలి సినిమాకి ముందు బాహుబలి తర్వాత అనేలా చూడొచ్చు. ఈ సినిమా తర్వాత మేకర్స్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇదిలావుండగా ఇప్పుడు టాలీవుడ్ కి మరోకొత్త పద్దతి నేర్పించారు జక్కన్న.. ఏ సినిమాకైనా ఓ రిలీజ్ డేట్ ఉంటుంది. అప్పటికి కుదరకపోతే మరో తేదీ ప్రకటించేవారు.

కానీ ఇప్పుడు చాలామంది నిర్మాతలు తమ సినిమాలకు రెండేసి తేదీలు ప్రకటిస్తున్నారు. దీనికి కారణం జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి గతంలో రెండు విడుదల తేదీలు ప్రకటించాడు రాజమౌళి. ఇప్పుడు దీనినే ఫాలో అవుతున్నారు చాలా మంది నిర్మాతలు. భీమ్లానాయక్ సినిమాకి కూడా రెండు తేదీలు ప్రకటించారు. కుదిరితే ఫిబ్రవరి 25, కుదరకపోతే ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఇక వరుణ్ తేజ్ గని సినిమాని వీలైతే ఫిబ్రవరి 25న, వీలు కాకపోతే మార్చి 4న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story