Rajamouli: 'ఆర్ఆర్ఆర్'లో ఈ విషయాన్ని సీక్రెట్‌గా దాచిపెట్టిన రాజమౌళి..

Rajamouli: ఆర్ఆర్ఆర్లో ఈ విషయాన్ని సీక్రెట్‌గా దాచిపెట్టిన రాజమౌళి..
Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటించింది.

Rajamouli: మార్చి 25న విడుదల కానున్న 'ఆర్ఆర్ఆర్' కోసం మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి'తో తెలుగు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్‌టీఆర్ లాంటి నటులతో ఏం మ్యాజిక్ చేయనున్నాడో అని చూడడానికి చాలా ఆతృతతో ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ గాసిప్ ప్రేక్షకులలో మరింత ఆసక్తి రేకెత్తించేలాగా ఉంది.

'ఆర్ఆర్ఆర్'ను ఓ దేశభక్తి సినిమాగా తీర్చిదిద్దాడు రాజమౌళి. అందులో ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్‌టీఆర్‌ను, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను చూపించనున్నాడు. ఇక ట్రైలర్ కట్ చూస్తే.. మూవీలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థమవుతోంది. అయితే ఈ సినిమా గురించి ఓ విషయాన్ని రాజమౌళి దాచేస్తున్నాడని, థియేటర్లలో విడుదలయిన తరువాతే అది అందరికీ తెలుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటించింది. అయితే ఆలియా భట్ పాత్ర నిడివి చాలా చిన్నగా ఉంటుందని మూవీ టీమ్ ముందు నుండే చెప్తూ వస్తుంది. పాత్ర నిడివి చిన్నదే అయినా.. అదే కథను మలుపు తిప్పుతుంది అని కూడా రాజమౌళి ఇప్పటికే వెల్లడించాడు. అయితే అంతే కాకుండా ఆలియా భట్ క్యారెక్టర్ గురించి మరో సీక్రెట్ ఇటీవల బయటపడింది.

ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ నుండి మూడు పాటలు విడుదలయ్యాయి. అందులో రామ్ చరణ్, ఎన్‌టీఆరే మెయిన్ హైలెట్‌గా నిలిచారు. అయితే ఇవి మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్, ఆలియా భట్ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని చాలాకాలం క్రితం రాజమౌళిని అడగగా.. సినిమాలో అలాంటి పాట అవసరమైతే పెడతాను అని సమాధానమిచ్చారు. ఇప్పుడేమో నిజంగానే అలాంటి ఓ పాట ఉందంటూ టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఓ క్లారిటీ రావాలంటే మూవీ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story