RRR: ఎన్టీఆర్ అరెస్ట్.. సీన్ అదిరిపోయింది: రివీల్ చేసిన జక్కన్న

RRR: ఎన్టీఆర్ అరెస్ట్.. సీన్ అదిరిపోయింది: రివీల్ చేసిన జక్కన్న
RRR: సందీప్ రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని రివీల్ చేశారు.

RRR: ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రమోషన్లలోనే సగం సినిమా చూపించేస్తున్నారు. ఒకటా రెండు ఒకే రోజు నాలుగైదు ఇంటర్వ్యూలు కూడా చేస్తూ అందరూ ఆర్ఆర్ఆర్ గురించే మాట్లాడుకునేలా చేస్తున్నారు.

వారం రోజుల నుంచి దేశం మొత్తం తిరుగుతూ ప్రమోషన్లు చేస్తున్నారు.. సినిమాపై మరింత హైప్ తీసుకొస్తున్నారు. చెప్పిన మాటలు చెప్పకుండా ఏదో ఒక పాయింట్ చెప్పి వదిలేస్తూ ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తిని కలిగిస్తున్నారు జక్కన్న అండ్ కో.

తాజాగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని రివీల్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అరెస్ట్ సీన్.. అదిరిపోయేలా ఉంటుంది.

కొమరం భీమ్ (ఎన్టీఆర్)ను బ్రిటీష్ అధికారిగా ఉన్న అల్లూరి సీతారామ రాజు (రామ్ చరణ్) అరెస్ట్ చేసే సన్నివేశంలో 1000 మంది దొమ్మి తరహాలో కొట్టుకుంటూ ఉంటారు. వారిని చెదరగొట్టడానికి రామ్ చరణ్ అందరినీ లాఠీతో కొడుతుంటాడు.

ముందు ఆ సీన్ ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కి అప్పగించారట. అయితే అది జక్కన్నకు నచ్చలేదు.. దాంతో ఆసీన్ ని స్టంట్ మాస్టర్ సాల్మన్ తో చేయించారు. ఆ సీన్ అద్భుతంగా చేసి జక్కన్న మనసు దోచుకున్నాడట స్టంట్ మాస్టర్.

ఎన్టీఆర్ అరెస్ట్ సీన్ సినిమాకు హైలెట్ అవుతుందని రాజమౌళి చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story