Rajinikanth: యంగ్ హీరోతో రజినీకాంత్ మల్టీ స్టారర్.. 'బీస్ట్' దర్శకుడి సినిమాలో..

Rajinikanth: యంగ్ హీరోతో రజినీకాంత్ మల్టీ స్టారర్.. బీస్ట్ దర్శకుడి సినిమాలో..
Rajinikanth: విజయ్ హీరోగా తెరకెక్కిన ‘బీస్ట్’తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో మల్టీ స్టారర్లలో నటించారు. అందులో చాలావరకు ఆయనకు సూపర్ సక్సెస్‌ను తెచ్చిపెట్టాయి. మళ్లీ చాలాకాలం తర్వాత మల్టీ స్టారర్‌కు రజినీ ఓకే చెప్పినట్టు సమాచారం. అది కూడా ఓ యంగ్ హీరోతో. 'బీస్ట్' డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కూడా ఉన్నట్టు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

విజయ్ హీరోగా తెరకెక్కిన 'బీస్ట్' సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. చేసింది తక్కువ సినిమాలే అయినా అప్పుడే రజినీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. బీస్ట్ సినిమా రిజల్ట్ వల్ల వీరి కాంబినేషన్‌లో సినిమా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తుండగా.. ఇంతలోనే ఈ సినిమా కన్ఫర్మ్ అని ఇందులో ఓ యంగ్ హీరో కూడా ఉండనున్నాడని టాక్ వైరల్‌గా మారింది.

యంగ్ హీరో శివకార్తికేయన్‌ను రజినీకాంత్‌తో చేసే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సెలక్ట్ చేశాడట నెల్సన్. ఇప్పటికే నెల్సన్ తెరకెక్కించిన బీస్ట్‌లో శివకార్తికేయన్.. అరబిక్ కుతు అనే పాట రాశాడు. అదే సాన్నిహిత్యంతో తనను ఈ సినిమాలోకి తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'డాక్టర్' సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన శివకార్తికేయన్.. ఇప్పుడు రజినీకాంత్‌తోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు తన ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story