Rangasthalam : నాలుగేళ్ళ 'రంగస్థలం'... వదులుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్స్..!

Rangasthalam : నాలుగేళ్ళ రంగస్థలం... వదులుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్స్..!
Rangasthalam : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌‌చరణ్ తేజ్ హీరోగా నటించిన మూవీ 'రంగస్థలం'.

Rangasthalam : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌‌చరణ్ తేజ్ హీరోగా నటించిన మూవీ 'రంగస్థలం'. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ క్రియేట్ చేసిన ఈ మూవీకి నేటితో నాలుగేళ్ళు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.

' వన్ నేనొక్కడినే మూవీ తర్వాత ఈ కథను అనుకున్నారు సుకుమార్.. ఆ తర్వాత ఇద్దరు స్టార్ హీరోలకి ఈ కథని వినిపించారు కూడా .. కానీ వారు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో రామ్ చరణ్ వద్దకి ఈ కథ వెళ్ళింది.

* సింగిల్ సిట్టింగ్ లోనే రామ్ చరణ్, చిరంజీవి ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.

* చిట్టిబాబు పాత్రను ముందుగా చేపలు పట్టే జాలరిగా డిజైన్ చేసి ఆ తర్వాత పంట పొలాలకి నీళ్ళు పెట్టె వ్యక్తిగా మార్చారు.

* ఉప్పెన మూవీతో డైరెక్టర్‌‌గా మారిన చిట్టిబాబు ఈ సినిమాలోని చాలా సీన్స్ లలో హెల్ప్ చేశాడు.

* ముందుగా రామ్ చరణ్ పక్కన హీరోయిన్‌‌గా అనుపమ పరమేశ్వరన్‌‌ని అనుకున్నారు.. ఆమెతో స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆమెను వద్దనుకోని కొత్త అమ్మాయిని తీసుకోవాలని అనుకున్నారు.. ఫైనల్‌‌గా సమంత ఓకే చేశారు.

* రంగమ్మత్త పాత్రకి సీనియర్ హీరోయిన్ రాశిని అడిగారు సుకుమార్.. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో అప్పుడెప్పుడో HRగా పనిచేస్తోన్న అనసూయ గుర్తొచ్చి ఆమెను అప్రోచ్ అయ్యారు. ఆమె వెంటనే ఓకే చెప్పేసింది.

* విలన్‌‌గా జగపతిబాబు, చిట్టిబాబుకి అన్నయ్యగా ఆది పినిశెట్టిని తీసుకున్నారు.

' 2017 ఏప్రిల్ లో మూవీ షూటింగ్ రాజమండ్రిలో స్టార్ట్ అవ్వగా, చిరంజీవి చీఫ్ గెస్ట్‌‌గా వచ్చారు.

* అరువై కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కిన ఈ మూవీ ఎనబై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుంది.

* ఈ చిత్రానికి మొదట 'రంగస్థలం 1985' అని టైటిల్ పెట్టినప్పటికీ ఆ తర్వాత దానిని రంగస్థలం అని పేరు మార్చారు

* ఈ సినిమాకి మొత్తం పాటలు చంద్రబోస్ రాశారు. అయితే నాలుగు రోజుల్లో ఆరు పాటలను చంద్రబోస్ రాయడం విశేషం కాగా... చంద్రబోస్ లిరిక్స్ రాశాక ట్యూన్స్ కంపోజ్ చేశారు.

* అగట్టునుంటావా అనే పాట ఆడియోలో ఒక సింగర్ వాయిస్, వీడియోలో మరో సింగర్ వాయిస్ ఉంటుంది.

* వ‌ర‌ల్డ్ వైడ్ రూ. 122.47 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టింది ఈ చిత్రం.

* ఈ సినిమాకి గాను చరణ్ కి ఫిలిం ఫేర్ అవార్డు వరించింది.

* పెళ్లి అయ్యాక సమంత నుంచి రిలీజైన ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం.

* ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాగా, సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story