Ram Charan: 'ఆర్ఆర్ఆర్'లో ఎవరి డామినేషన్ ఎక్కువుంది అనేదానిపై ఆగని చర్చ.. స్పందించిన రామ్ చరణ్..

Ram Charan: ఆర్ఆర్ఆర్లో ఎవరి డామినేషన్ ఎక్కువుంది అనేదానిపై ఆగని చర్చ.. స్పందించిన రామ్ చరణ్..
Ram Charan: రామ్ చరణ్, ఎన్‌టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమా చేస్తుండడంతో.. ఇద్దరికీ సమానంగా స్క్రీన్ స్పేస్ వచ్చింది.

Ram Charan: ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తు్న్నారంటే వారి అభిమానులు కూడా కలిసి ఆ సినిమాను చూసి, ఏ నెగిటివిటీని వ్యాప్తి చేయొద్దని వారు కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం ఆ సినిమాలో ఏ హీరో గొప్ప అనే ప్రశ్నను లేవనెత్తి దుమారం సృష్టిస్తారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఫైనల్‌గా ఆ కామెంట్స్‌పై రామ్ చరణ్ స్పందించాడు.

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'.. కథాపరంగా, యాక్టింగ్ పరంగా అందరితో శభాష్ అనిపించుకుంది. అంతే కాకుండా కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా ఉన్న రికార్డులను బ్రేక్ చేసుకుంటూ.. సరికొత్త రికార్డులను సృష్టించుకుంటూ ముందుకెళ్తోంది. కానీ ఎన్‌టీఆర్ యాక్టింగ్ బాగుందా? రామ్ చరణ్ యాక్టింగ్ బాగుందా? అనే చర్చకు మాత్రం ముగింపు రావట్లేదు.

రామ్ చరణ్, ఎన్‌టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేస్తుండడంతో.. ఇద్దరికీ సమానంగా స్క్రీన్ స్పేస్ వచ్చేలాగా జాగ్రత్తపడ్డాడు. ఇక హీరోల యాక్టింగ్ విషయానికొస్తే.. ఒకరితో ఒకరు పోటీపడి మరీ చేశారు. అందుకే సినిమా ఇంకా థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. అందుకే మూవీ టీమ్ తాజాగా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.

ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్‌లో ఎన్‌టీఆర్‌ను రామ్ చరణ్ డామినేట్ చేశాడని ప్రేక్షకులు అంటున్నారని.. దానిపై వారి స్పందన ఏంటని అడిగింది ఓ విలేఖరి. దానికి సమాధానంగా రామ్ చరణ్.. అసలు డామినేషన్ అనే మాటను తాను నమ్మను అన్నాడు. ఇద్దరం చాలా బాగా చేశామని చెప్పాడు. తారక్ నటన చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించాడు. దీంతో ఈ డామినేషన్ గేమ్‌కు రామ్ చరణ్ తనదైన స్టైల్‌లో ఫుల్‌స్టాప్ పెట్టాడు.

Tags

Read MoreRead Less
Next Story