సినిమా

Ram Gopal Varma: ఏపీలో సినిమా టికెట్ ధరలపై ఆర్జీవి సెన్సేషనల్ కామెంట్స్..

Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వం.. సినిమా టిక్కెట్‌ రేట్లు తగ్గించడాన్ని తప్పు బట్టారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.

Ram Gopal Varma (tv5news.in)
X

Ram Gopal Varma (tv5news.in)

Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వం.. సినిమా టిక్కెట్‌ రేట్లు తగ్గించడాన్ని తప్పు బట్టారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. సినిమా టికెట్ ధరను నియంత్రించినట్లు ఫైవ్‌స్టార్‌ హోటల్ పుడ్‌ ధరలను కూడా నియంత్రిస్తారా? బ్రాండెడ్‌ షర్ట్స్‌ల ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి.? అని ప్రశ్నించారు. సినిమా మేకింగ్‌లో 70శాతం హీరోలకు రెమ్యునరేషన్‌ పోతుందన్న మంత్రులు పేర్నినాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలను సైతం ఖండించారు.

నిర్మాణం ఖర్చులలోనే హీరోల రెమ్యునరేషన్‌ ఉంటుందన్నారు. నష్టపోవాలని భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయరని అన్నారు. హీరోకు భారీగా డబ్బు ఇచ్చేది అతని ముఖం చూసేనన్నారు. ఆ హీరోనూ చూసే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్నారు. రేకుల షెడ్డుకు మల్టీప్లెక్స్‌లకు ఒకటే టికెట్‌ అంటే ఏలా ? అంటూ జగన్ సర్కారు తీరును ఎద్దేవా చేశారు.

Next Story

RELATED STORIES