Ram Gopal Varma: 'అవి అనవసరమైన మాటలు'.. 'ఆర్ఆర్ఆర్'పై ఆర్‌జీవీ కామెంట్స్..

Ram Gopal Varma: అవి అనవసరమైన మాటలు.. ఆర్ఆర్ఆర్పై ఆర్‌జీవీ కామెంట్స్..
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ కూడా ఆర్ఆర్ఆర్‌పై తన ఒపినియన్‌ను చెప్పారు.

Ram Gopal Varma: ప్రస్తుతం సినీ ప్రపంచమంతా 'ఆర్ఆర్ఆర్' మ్యాజిక్‌లో మునిగి తేలుతుంది. గత శుక్రవారం విడుదలయినా కూడా ఇప్పటికీ ఈ సినిమాకు హౌస్ ఫుల్ షోస్ నడుస్తు్న్నాయి. అయితే ఇప్పటికే ఎందరో సినీ సెలబ్రిటీలు దీనిపై స్పందించారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌పై తన ఒపినియన్‌ను చెప్పారు. కానీ మరోసారి ఆర్ఆర్ఆర్‌పై స్పందించారు ఆర్‌జీవీ.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తనలోని చిన్నపిల్లాడిని బయటపెట్టింది అన్నారు ఆర్‌జీవీ. ఫేమస్‌, స్టేటస్‌... ఇలా అన్నీ మర్చిపోయి ప్రతి సన్నివేశాన్ని మనస్ఫూర్తిగా ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తూ సినిమా చూశానన్నారు. ట్రైలర్‌ చూసినప్పుడు సినిమా బాగుంటుందని భావించానని, కానీ సినిమా చూశాక ఇదొక అద్భుతమైన చిత్రమని తెలుసుకున్నానని తెలిపారు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదని, మాటలు కరవయ్యాయని చెప్పారు వర్మ.

తాను దేని గురించి మాట్లాడినా ఫుల్‌ క్లారిటీగా ఉంటానని, కానీ జీవితంలో మొదటిసారి ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు రామ్ గోపాల్ వర్మ. కథేంటి? పాత్రలు ఎవరు? అనే విషయాన్ని పక్కనపెడితే కథ చెప్పిన విధానం, విజువల్‌గా స్క్రీన్‌పై చూపించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని బయటపెట్టారు. చరణ్‌ పాత్ర బాగుంది.. లేదా తారక్‌ పాత్ర చాలా బాగుంది.. అని కొంతమంది చెబుతున్నారని.. ఆ రెండూ అనవసరమైన మాటలని తేల్చి చెప్పారు. ఎవరికి వాళ్లే ప్రతి సీన్‌లోనూ అదరగొట్టేశారని ప్రశంసించారు.

గడిచిన 30 ఏళ్లలో ఇంతలా ఏ చిత్రాన్ని తాను ఎంజాయ్ చేయలేదన్నారు ఆర్‌జీవీ. రాజమౌళి ప్రేక్షకులకు దొరికిన బంగారమని, ప్రేక్షకుల కోసమే పుట్టాడని, తనలాంటి వ్యక్తి ఈ భూమ్మీదకు వచ్చి.. సినిమానే కలగా చేసుకుని.. దర్శకుడిగా మంచి చిత్రాలు తెరకెక్కిస్తున్నందుకు సినీ ప్రియులందరూ ఎంతో ఆనందిస్తున్నారని రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు.

Tags

Read MoreRead Less
Next Story