RGV Sister Vijaya Lakshmi First Interview: అన్న అమాయకుడు.. తొమ్మిదేళ్ల వయసులోనే..: వర్మ సోదరి విజయలక్ష్మి

RGV Sister Vijaya Lakshmi First Interview: అన్న అమాయకుడు.. తొమ్మిదేళ్ల వయసులోనే..: వర్మ సోదరి విజయలక్ష్మి
RGV Sister Vijaya Lakshmi First Interview: అన్నకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు మామయ్య మా ఇద్దర్నీ సినిమాకు తీసుకెళ్లాడు..

RGV Sister Vijaya Lakshmi First Interview: అమ్మకి కొడుకు.. చెల్లికి అన్న.. ఎప్పుడూ మంచివాళ్లే.. ఏం చేసినా వెనకేసుకొచ్చేవాళ్లే.. ఆర్జీవీ విషయంలోనూ అదే జరిగింది.. అమ్మాయిల పిచ్చోడని కామెంట్ చేస్తారు కానీ.. మా అన్నకు అమ్మాయిలంటే ఎనలేని గౌరవం.. మీరు చెప్పేవన్నీ వట్టి మాటలు అని కొట్టి పారేస్తున్నారు రాంగోపాల్ వర్మ అక్కయ్య విజయలక్ష్మి.

అసలు వర్మ.. ఓ పజిల్ ఎవరికీ అర్థం కాడు.. ఏ క్షణంలో ఏం మాట్లాడతాడో తెలియదు.. ఆయన అన్న మాటలకి లోలోపల నొచ్చుకున్నా సంతోషపడే వాళ్లు కూడా కొందరుంటారు.. ఈ మనిషి చిన్నప్పటి నుంచి ఇంతేనా.. లేదంటే ఇండస్ట్రీకి వచ్చాకే ఇలా తయారయ్యాడా అని అనుకునే వాళ్లుంటారు.. అవును వాడు చిన్నప్పటి నుంచి అంతే అంటోంది అక్క.


ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్ముడు వర్మ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేవాడు. చిన్నప్పటి నుంచి అన్నయ్య భిన్నంగా ఆలోచించేవాడు. అసలు ఎవరికీ అర్థం అయ్యేవాడు కాదు. అన్నకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు మామయ్య మా ఇద్దర్నీ సినిమాకు తీసుకెళ్లాడు..

ఇంటికి వచ్చాక ఆ సినిమాలోని ఓ సన్నివేశం గురించి మామయ్యతో మాట్లాడాడు.. సినిమాలో కొందరు రౌడీలు రైలు పట్టాలపై బాంబ్ పెట్టి టైమ్ సెట్ చేశారు. ట్రైన్ రాగానే బాంబ్ పేలే విధంగా ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని అన్నయ్య మామయ్యని అడిగాడు.. ట్రైన్ ఎప్పుడైనా సరైన టైమ్‌కి వస్తుందా.. టైమ్ సెట్ చేసి బాంబ్ పెట్టడం ఎందుకు అని ప్రశ్నించాడు. ఇలా అన్నయ్య ప్రతి విషయాన్ని ప్రశ్నించేవాడు. లాజికల్‌గా థింక్ చేసేవాడు.


ఇక అమ్మాయిల పిచ్చోడు అనే అపవాదు వేస్తున్నారు కానీ ఆ పదం అన్నకు అస్సలు సూట్ కాదు.. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంటికి నా స్నేహితురాలు అనురాధ వచ్చింది. ఆమెతో నీ కళ్లు బావున్నాయి అని చెప్పాడు. అది విని నేను షాక్ అయ్యా. కానీ నా స్నేహితురాలు మాత్రం అన్నయ్య పొగిడినందుకు చాలా సంతోషించింది.

అయితే వర్మతో నేను.. దానికి మెల్ల కన్ను.. నీకెలా నచ్చింది అని అడిగితే.. అసలు నేను ఆమెను చూడలేదు.. ఏదో అలా అనేశాను అని చెప్పాడు. బ్యాంకులో కూడా ఒక అమ్మాయితో ఇలాగే.. వీ నవ్వు బాగుంది అన్నాడు.. ఇలా అన్నయ్య అమ్మాయిలను సంతోషపెట్టే మాటలే తప్పఏ రోజు వారితో చెడుగా ప్రవర్తించలేదు.. ఈ మధ్య అమ్మాయిలతో డ్యాన్స్ చేయడం కూడా అలాంటిదే అని వివరించారామె.

Tags

Read MoreRead Less
Next Story